Header Ads

గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేయాలంటే..ఈ చిన్న టిప్స్ పాటించండి చాలు !!

మీరు ప్రేమించిన అమ్మయిని తానే గొప్ప అనాలట.. ఎవరితో అయినా పోల్చి తనని తక్కవ చేసి మాట్ల్లాడుతున్నపుడు ఆమెకు చాలా కోపం వస్తుందట. అందుకే కుదిరిన ప్రతి సారి తానే గొప్ప అనేలా మాట్లాడేందుకు ప్రయతించాలట. అంతేకాని నీకన్నా.. సమంత లేదా తమన్నా బాగుంటుంది అని చెబితే మీ పని ఖతమేనట. ఇటీవల నిర్వహించిన అధ్యయనం అమ్మాయిలను విశేషంగా ఆకట్టుకునే కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. అవేమిటంటే.. బయటకి ఎక్కడికి అయినా వెళ్ళినపుడు వారి ఇష్టానికే విలువివ్వాలి. అంతే కాదు కాస్త నోరుని కూడా కంట్రోల్ లో పెట్టుకోవాలి. వాళ్లకు బాగా నచ్చినదాన్ని అస్సలు బాగోలేదు అని ఎప్పుడు అనకూడదు సున్నితంగా చెప్పాలి. ఇది బాగుంది.. మరొకటి ఇంకా బాగుంటుందేమో అన్నట్టుగా చెప్పాలి. ఇంకా అధ్యయనం వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు ఏమంటే..

* ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి.. అయితే వాటిని ఎవరైనా ఎత్తి చూపిస్తుంటే వారు తట్టుకోలేరు. మీరు కూడా మిమ్మల్ని ప్రేమించేవారి బలహీనతల్ని ఎత్తిచూపటానికి ఎట్టి పరిస్తుతుల్లోనూ ప్రయత్నించకండి.

* నీకు భయంఎక్కువ.. నీకు మాట్లాడటం రాదు.. ఎప్పుడూ తొందరపడుతూ ఉంటావ్.. లాంటి ప్రశ్నల తో వారిని విసిగించారు అనుకోండి. వారు నొచ్చుకొని మీ బలహీనతలు వెతికే పనిలో పడతారు. అవి మాటపట్టింపులకు కూడా దారి తీయొచ్చు.

* ప్రతి మనిషికీ ఏదో ఒక ఇష్టం ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ఒక ఇష్టం ఉంటుంది. వీలైతే వాటికి ప్రోత్సహమివ్వండి వారిని నిరుత్సహపరిచే విధంగా మాట్లాడొద్దు.