Header Ads

ప్రశ్న/సమాధానం: తన చెల్లెలి కోరిక తీర్చమని మా ఆవిడ బలవంతం చేస్తుంది

ప్రశ్న : మా పెళ్లి అయ్యి ఏడు నెలలు అవుతుంది. మా ఇద్దరికి ఒకరం అంటే ఒకరికి చాలా ఇష్టం. మేం ఇద్దరం కూడా చాలా అన్యోన్యంగా ఉంటున్నాం. ఈ సమయంలోనే మా ఆవిడకు వరుసకు చెల్లి అయ్యే అమ్మాయి మా ఇంటికి వచ్చింది. తను చదివే కాలేజ్‌ మేము ఉండే ఏరియాకు దగ్గరగా ఉంటుంది. దాంతో ఆ అమ్మాయి వారంలో రెండు మూడు రోజులు వస్తూ రాత్రి సమయంలో కూడా ఉంటుంది. ఆమె తోడుగా ఉండటంతో నా వైఫ్‌ కూడా సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలోనే తాను నా మీద ఇష్టం పెంచుకున్నట్టు తెలుస్తుంది. షాకింగ్ ఏంటంటే దానికి మా ఆవిడా పూర్తిగా అంగీకరిస్తుంది. ఏం పర్వాలేదు తనకు తానుగా ఇష్టపడుతుంది తన కోరిక తీర్చమని మా ఆవిడ బలవంతం చేస్తుంది. నేను నా భార్యకు అన్యాయం చేయలేను అనిపిస్తుంది. ఈ పరిస్థితిలో నేనేం చేయాలి ? నాకు ఏదైనా పరిష్కారం చూపండి.(శ్రీనివాస్.. తిరుపతి)

సమాధానం : మీరు చాలా మంచివారుగా అనిపిస్తుంది. జీవితంలో అక్రమ సంబంధాలు అనేవి ఎప్పటికి మంచిది కాదు. అక్రమ సంబంధాల వలన సంసారాలతో పాటు జీవితాలు కూడా నాశనం అవుతాయి. మీరు ఆ అమ్మాయిని ఇంటికి రాకుండా చేయండి. లేదంటే మీ ఆవిడకు ఏదైనా చెప్పి ఇల్లు మారే ప్లాన్‌ చేయండి. ఇలా కాకుండా మీరు క్షణికావేశంలో తప్పు చేస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మీ సంసారం ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతుంది. అందుకే మీరు ఆ అమ్మాయికి సాధ్యం అయినంత దూరం వెళ్లిపోవడం ఉత్తమం.