Header Ads

రాత్రి పడుకునే ముందు కొబ్బరి నీళ్ళు కీరా డ్రింక్ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..

ఇది చాలా పవర్ ఫుల్ ఫ్యాట్ కరిగించే డ్రింక్. ఇంకా చాలా సింపుల్ గా, టేస్టీగా మీరే చేసుకునే అద్భుతమైన డ్రింక్ ఇది. 10-15 రోజులకు తగ్గకుండా బెల్లీ ఫ్యాట్ పెద్ద మొత్తంలో కరిగిపోతుంది. అంతేకాదు డయాబెటిస్, హార్ట్ డిసీజ్ లకు సైతం దూరంగా ఉంచుతుంది. రాత్రి పడుకోవడానికి ముందు కేవలం ఒక గ్లాసు ఇది తాగితే చాలు.. శరీరంలో ఫ్యాట్.. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. చాలా తక్కువ ధరకు దొరికే కీర దోసకాయ (కుకుంబర్)లో ఫలితాలు చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. అందులో కొబ్బరినీళ్లను కలిపి తీసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. కొబ్బరి నీళ్లు అందుబాటులో లేని వాళ్లు మంచి నీళ్లతోనైనా తీసుకోవచ్చు.

డ్రింక్ తయారీ విధానం:కీరా దోసకాయను శుభ్రం చేసి, తొక్క తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. దీన్ని రెండు లీటర్ల నీళ్లు పట్టే ఒక గ్లాస్ కంటెయినర్ లో కలపాలి. ఈ కంటెయినర్ ని ఒకరోజంతా ఫ్రిడ్జ్ లో పెట్టాలి. నీళ్లకు బదులు ఎలక్ట్రోలైట్స్ ఉండే కొబ్బరినీళ్లు ఉపయోగిస్తే.. చాలా ఎఫెక్టివ్ గా బెల్లీ ఫ్యాట్ ని కరిగించుకోవచ్చు. ప్రతిరోజూ రాత్రి పడుకోవడానికి ముందు ఒక గ్లాసు ఈ డ్రింక్ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ చాలా తేలికగా కరిగిపోతుంది.
కుకుంబర్, కొబ్బరినీళ్ల డ్రింక్ అమేజింగ్ బెన్ఫిట్స్:
* గుండె వ్యాధులు కుకుంబర్ వాటర్ ని తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల హార్ట్ డిసీజ్ రిస్క్ లకు దూరంగా ఉండొచ్చు.

* కండరాలకు అవసరమైన చాలా ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. కాబట్టి కండరాలను సౌష్టవంగా చేయాలనుకుంటే రోజుకి కనీసం రెండు గ్లాసులు తీసుకోవాలి.

* కుకుంబర్ వాటర్ లో బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బ్రెయిన్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తాయి. కాబట్టి ఒత్తిడి, అల్జీమర్స్ వంటి వ్యాధుల ముప్పు నుంచి బయటపడొచ్చు.

* కంటి సమస్యలను నివారించడంలో కూడా ఈ డ్రింక్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

* కీళ్ల నొప్పులను వయసుతో సంబంధం లేకుండా ఎదుర్కొంటున్నారు. దీన్ని అదుపుచేయడంలో ఈ డ్రింక్ సహాయపడుతుంది.

* కుకుంబర్ డ్రింక్ ఎముకలను బలంగా మార్చడం వల్ల కీళ్లనొప్పులను అడ్డుకుంటుంది.

* చర్మానికి ఈ డ్రింక్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. స్కిన్ టోన్ ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. దీనికి దోసకాయలో ఉండే సిలికేట్ సహాయపడుతుంది.

* శరీరంలో పేరుకున్న టాక్సిన్స్ ని బయటకు పంపడంలో కుకుంబర్ వాటర్ చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఎఫెక్టివ్ గా శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది.