Header Ads

జబర్దస్త్ వినోద్ ఆత్మహత్య ప్రయత్నం.. పోలీసులు ఆసుపత్రికి తరలింపు!! Jabardasth Artist Vinodini Sucide Attempt


జ‌బ‌ర్దస్త్ లో లేడీ గెటప్ తో నవ్వులు పూయించే వినోద్… ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చేతిని గాయపరుచుకుని చనిపోవడానికి యత్నించాడు. బలవంతపు పెళ్లి ఇష్టం లేక సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే సోమ‌వారం నాడు కర్నూలు జిల్లాలోని సంజామల మండలం బొందలదిన్నెలోని ఓ చర్చిలో పెళ్లి చేసేందుకు యత్నించడంతో వినోద్ తన చేతిని గాయపర్చుకున్నాడు. పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నప్పటికీ బలవంతంగా పెళ్లి చేసేందుకు అతని తల్లిదండ్రులు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వినోద్ పెళ్లిని నిలిపివేశారు. వినోద్ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.