Header Ads

తమిళుల్ని, తెలంగాణ ప్రజలని చూసి సీమాంధ్రులు సిగ్గుతెచ్చుకోవాలి!! అందరికి షేర్ చేయండి!!


తమిళుల సాంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు మద్దతుదారుల ఉద్యమం రోజురోజుకు ఉగ్రరూపం దాల్చింది. వరుసగా ఐదురోజులపాటు ప్రజలు వేలసంఖ్యలో మెరీనాబీచ్‌కు పోటెత్తారు. ఈ ఉద్యమ సెగ దేశరాజధాని ఢిల్లీకి సైతం తాకింది. రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛంధంగా విద్యార్ధులు, యువకులు, పిల్లలు పెద్దలు అందరూ ఈ ఉద్యమంలో పాల్గొనడంతో స్వచ్చంధ సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం సమావేశమయ్యారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన ఎద్దులక్రీడ జల్లికట్టు నిర్వహణకు వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మోదీ ఓ వైపు భరోసా ఇస్తూనే మరోవైపు ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని తాను సాంప్రదాయాలకు మద్దతిచ్చి ఉద్యమానికి మద్దతు పలుకుతున్నానని చెప్పారు. కేవలం ఐదురోజుల్లోనే తమిళులు అనుకున్నది సాధించారు.

తమిళ సంస్కృతికి జల్లికట్టు ప్రతీక అని కేంద్రానికి తెలిసేలా చేశారు. అదే విధంగా దశాబ్ధాలపాటు పోరాడి, ఎందరో ఉద్యమకారుల ప్రాణాలు పోగొట్టుకుంటున్నా చెదరని సంకల్పంతో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటపటిమతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కేసులకు, అరెస్టులకు భయపడలేదు.. మిలియన్ మార్చ్ లు, బంద్ లు, రాస్తారోకోలు చేపట్టారు. చివరకు ఆయన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.. కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారు. కానీ విభజనవల్ల రాజధాని కూడా లేకుండా లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీకి అత్యంత ఆవశ్యకమైన ప్రత్యేకహోదాసాధనకు మాత్రం ప్రజలు ఏకమవ్వలేకపోతున్నారు. సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతివ్వట్లేదు. హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు.