Header Ads

ఒక అమ్మాయికి మీ మీద కోరిక ఉందో లేదో ఈ విధంగా తెలుసుకోండి చాలా ఈజీ


  1. మీరు మాట్లాడే మాటలు.. మీరు చేసే పనులు.. ఇలా మీరు చేసే ప్రతీది ఆమె గమనిస్తుందంటే ఆమె మీపై ఇష్టం చూపిస్తున్నట్టే. మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం… మీకు ఎలాంటి డ్రెస్ అంటే ఇష్టం.. అనే విషయాలు అడిగి మరీ తెలుసుకుంటుంది. పక్కన ఎంత మంది ఉన్నా మీరు చెప్పే మాటలపై ఎక్కువ దృష్టి పెడుతుందంటే ఆమె మిమ్మల్ని బలంగా కోరుకుంటున్నట్టే.
  2. అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడితే ఆ విషయాన్ని వారు ఎక్కువ కాలం దాచలేరు. ఆమె కళ్ళను, నవ్వును గమనించండి. మిమ్మల్ని ఎక్కువగా గమనిస్తుందని తెలిసినా లేక ఎక్కువసార్లు మీతో కళ్ళలోకి కళ్ళు పెట్టి మాట్లాడుతున్నా.. ఆమె మీపై ఇష్టం చూపిస్తుందని అర్ధం.
  3. అమ్మాయిలకి కాంప్లిమెంట్స్ అంటే చాలా ఇష్టం. కానీ మీ విషయంలో తానే మీకు తెగ కాంప్లిమెంట్స్ ఇస్తూ, నువ్వు వైట్ షర్ట్ లో చాలా బాగుంటావ్.. అని ఆమె చెప్తే.. ఆమె మిమ్మల్ని, మీ టేస్ట్ ని కూడా ఇష్టపడుతుందని అర్ధం.
  4. మీరు ఎదురైనప్పుడు తనని తాను అందంగా చూపించుకోవాలని ప్రయత్నిస్తుంది. కురులు సరి చేసుకోవడం.. పదే పదే తన అందాన్ని చెక్ చేసుకోవడం లాంటివి చేస్తుంది. మీ జోకులకు అందరికన్నా ఎక్కువ తానే నవ్వుతుంది.
  5. వీలైనప్పుడల్లా మిమ్మల్ని తాకడానికి ప్రయత్నిస్తుంది. కావాలనో లేక అనుకోకుండానో మీ చెయ్యి తనకి తాకినప్పుడు లోలోపల మురిసిపోతుంది. అందుకే గ్రూప్ ఫోటోలు దిగేటప్పుడు, మీ చేతికి ఏదైనా అందించేటప్పుడు, సరదాగా గొడవ పడుతున్నప్పుడు… మిమ్మల్ని తాకడానికి ప్రయత్నిస్తుంది.
  6. మీ గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీ లైఫ్ లో ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకుంటుంది.
  7. మీ కోసం ఎప్పుడైనా సరే.. కలవడానికి రెడీగా ఉంటుంది. అది మార్నింగ్ ఐదింటికైనా లేక రాత్రి పదకొండింటికైనా కావచ్చు… నో చెప్పకుండా ఎప్పుడైనా మీతో మాట్లాడడానికి, మీతో కలవడానికి రెడీగా ఉంటుంది.
  8. తనకు వీలు లేకపోయినా మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ఏదైనా చేస్తుంది. తన ఆఫీస్ లో బిజీగా ఉన్నా, లేక ఇంట్లో బిజీగా ఉన్నా, మీ ఫోన్ వచ్చిందంటే.. ఆ పనిని పక్కకు పెట్టి మీతో మాట్లాడుతుంది. అది కుదరకపోతే… వీలైనంత త్వరగా ఆ పని ముగించుకొని మీకు తిరిగి కాల్ చేస్తుంది.
  9. మీతో ఉన్నప్పుడు.. తన ఫ్రెండ్స్ మీ రిలేషన్ గురించి టీజ్ చేసినా పెద్దగా పట్టించుకోదు. నిజానికి మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా టీజ్ చేస్తుంటే మీ ఫీలింగ్ ఎలా ఉందని గమనిస్తుంది.
  10. ఇక చివరిగా మిగిలింది ఒకే ఒక్క విషయం…! ఇది చాలా డేంజర్..! అమ్మాయిలలో తప్పకుండా ఉండే క్వాలిటీ ఇది. మిమ్మల్ని వేరే అమ్మాయితో చూస్తే అస్సలు ఓర్వలేరు. మీతో ఉన్న ఇతర అమ్మాయిలతో పైకి నవ్వుతూ మాట్లాడినా.. లోపల అగ్నిగుండం ఎప్పుడెప్పుడు పెలుతుందా అన్నట్టు ఉంటుంది.