Header Ads

రోజుకు పది నిమిషాలు మహిళల వక్షోజాల వైపు చూస్తే.. 30 నిమిషాల జిమ్ చేసినట్టే.. ఛీ ఛీ అనుకోవద్దు ఇది పరిశోధన చేసి మరీ నిరూపించారు


రోజుకు పది నిమిషాలు మహిళల వక్షోజాల వైపు చూస్తే అదనంగా మరో ఐదేళ్ల పాటు ఆరోగ్యంగా బతకొచ్చని జర్మన్‌ పరిశోధకుడు డాక్టర్‌ కరేన్‌ వెదర్‌బై వెల్లడించారు. ది న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తను చేసిన పరిశోధనల ఫలితాన్ని వివరించారు. ఈ పరిశోధన ప్రకారం పది నిమిషాలు వక్షోజాల వైపు చూడడమనేది 30 నిమిషాలు జిమ్ లో వర్కవుట్‌ చేయడంతో సమానమట.

అంతసేపు జిమ్‌లో కష్టపడితే విడుదలయ్యే హార్మోన్లు పది నిమిషాలు వక్షోజాలు చూడడం వల్ల కూడా విడుదలవుతాయట. వక్షోజాలను చూస్తున్నప్పుడు పురుషుడి శరీరంలో రక్తపోటుతో పాటు హార్ట్‌బీట్‌ కూడా తగ్గుతుందట. గుండెజబ్బులను కూడా ఇది నిరోధిస్తుందట.

‘మానవ మెదడులో జరిగే కామ ఉద్దీపనలు శరీరరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తత్ఫలితంగా మంచి ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి వీలవుతుంద’ని కరేన్‌ సూచించారు. ఈ మేరకు జర్మనీకి చెందిన 200 మంది పురుషులపై ఐదు సంవత్సరాల పాటు ఈ పరిశోధన నిర్వహించినట్టు ఆయన తెలిపారు.