Header Ads

“హోదా కోసం” విశాఖ బీచ్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్న పవన్ ..!!

మెరీనాబీచ్ వేదికగా.. పట్టిన పట్టు వీడకుండా తమిళ ప్రజలు తాము అనుకున్నది సాధించారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా తమిళ ప్రజానీకమంతా ఒక్క తాటిపైకి వచ్చి జల్లికట్టు కోసం నినదించడంతో.. కేంద్రం సైతం దిగిరాక తప్పకలేదు. తమిళనాడు ప్రభుత్వం పంపించిన ఆర్డినెన్స్ ను కేంద్రం న్యాయశాఖ ఆమోదం కోసం పంపించింది. దీంతొ తమ ఆకాంక్ష నెరవేరినందుకు తమిళ ప్రజలంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

సలాం రా తమిళ సొదరా… నీ తెగువుకి, నీ తెగింపుకు … రాష్ట్రం కోసం, జల్లికట్టు కొసం, నీ సాంప్రదాయం కోసం నువ్వు చేసిన పొరాటం, తెగింపు కి సలాం! అదరక, బెదరక నువ్వు చేసిన ఈ పోరాటానికి సలాం! ఒక్క రాజకీయ నాయకుడి పైన కుడా ఆధారపడకుండా నువ్వు చేసిన ఉద్యమానికి సలాం !
మన రాష్ట్రానికి ప్రత్యేకహొదా కోసం మనం ఏమి కాని చేయలేకపొతున్నాం … వాళ్ళు మూడు రొజుల్లొ చేసింది మనం మూడు ఏళ్లైన ఏమీ చేయలేము.. ఇలా ప్రతి ఆంధ్రా యువకుడు కవితలు రాస్తున్నాడు. తమిళియులు సాధించారని కొనియాడుతున్నారు. అలాగే మన హోదా పరిస్ధితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

దీంతో పవన్ హోదాపై మళ్లీ నడుం బిగించినట్టుగా తెలుస్తోంది. జల్లికట్టు కోసం చేసిన ఉద్యమం నుంచి ఆంధ్రులు నేర్చుకోవాలని, అది ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి స్ఫూర్తి అని, తమిళుల ఉద్యమ స్ఫూర్తి తనను కదిలించిందని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం నాడు ట్వీట్ చేశారు. కేంద్రం నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోందని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించకుంటే అంతటా ఇలాంటి ఆందోళనలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. తమిళుల పోరాట పటిమ ఈ ఉద్యమం ద్వారా ప్రతిబింబించిందన్నారు. కులమతాలకు అతీతంగా తమిళులు అంతా ఏకమై జల్లికట్టు కోసం నినదించటం స్ఫూర్తిదాయకం అన్నారు.

లక్షలాది మంది మెరీనా బీచ్ వద్దకు వచ్చి ఉద్యమించినా, నిరసనలు చేపట్టినా ఎక్కడా అసాంఘిక ఘటనలు చోటు చేసుకోలేదని, ఇది చాలా సంతోషకరమన్నారు. తమిళుల అహింసాయుద పద్ధతి, పోరాటం, సంఘటిత శక్తి తనను కదిలించాయన్నారు. మన నేతలు కూడా ఇలాంటి సంఘీభావం ప్రదర్శించాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఉద్యమాన్ని, ఏపీ నేతలను ఉద్దేశించి అన్నారు. ఒకవేళ నేతలు రాజీపడ్డా ప్రజలు రాజీపడరనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఏపీకి హోదా సాధించాలన్నారు. ఇలా పవన్ అనటం చూస్తుంటే త్వరలో మోరీనా బీజ్ స్పూర్తితో విశాఖ బీచ్ ఉద్యమం చేపట్టనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే జనం, యువత జల్లికట్టు స్పూర్తితో తండోప తండాలుగా రావటం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.