Header Ads

నోట్లు రద్దు చేసి… మన సొమ్ముతో మోడీ చేస్తున్నది ఇదా ?


కడుపులో చల్ల కదలకుండా పనిచేసుకునేవాళ్లంతా ఇపుడు పని మాని క్యూలో నిలబడిపోయారు. అక్కౌంట్లో డబ్బున్నా చేతిలో పైసా లేక అల్లాడిపోతున్న బాపతే పదిమందిలో ఎనిమిది మంది ! మరో అరు నెలలు పడుతుందని కొందరు, ఐదొందల నోటు ఇప్పుడే రాదని ఇంకొందరు తిట్టుకుంటూ తిమ్ముకుంటూ వెళ్లదీస్తున్న రోజులివి. ఇప్పటికే పదిరోజులైంది. జనం సమస్యలు సరే ! అండర్ కరెంట్ గా మరో ఈక్వేషన్ వర్కవుట్ చేస్తున్నట్టున్నారు. ఇపుడు దేశమంతా ఇదే హీట్ పెంచుతున్న చర్చ. ఇంతకీ మన సొమ్ముతో మోడీ ఏం చేస్తున్నారు ?

మోడీ ముందు నుంచి ఇంతే !
ఊళ్లో ఉన్న సొమ్మంతా తెచ్చి గూట్లో పెట్టమన్నట్టుగా ఉంటాయ్ మోడీ పాలసీలు. జన్ ధన్ యోజన చూడండి. తలో ఐదువేలూ తెచ్చి బ్యాంకుల్లో దాచుకోవాలి. సరే. దానికి రిలేటెడ్ గా ఏదో స్కీమ్ ఉంటుందునుకోండి. అది వేరే సంగతి. గోల్డ్ డిపాజిట్ స్కీమ్ సంగతి కూడా ఇంతే. మన గోల్డ్ తీసుకెళ్లి బ్యాంకులో దాచుకుంటాం. ఆ నిల్వలతో బ్యాంకులు ఏకానమీకి బూస్ట్ ఇస్తాయ్. ఇలాంటి స్కీమ్ లతో 95 వేల కోట్ల వరకూ కలెక్ట్ చేసింది మోడీ ప్రభుత్వం. ఇపుడు కూడా నోట్ల రద్దుతోపాటు అలాంటి స్కీమ్ సమాంతరంగా నడుస్తున్నట్టు క్లారిటీ వస్తోంది ఇప్పుడిప్పుడే !

– 500 నోటు కావాలనే విడుదల చేయడం లేదా కేంద్రం ? రెండు వేల నోట్లు ఎన్నికావాలంటే అన్ని ఇస్తారు. కానీ ఖర్చు చేసుకునే పరిస్థితి లేదు. చిల్లర దొరకడం లేదు.
– మరో గత్యంతరం లేదు. అయితే ఆన్ లైన్ కి వెళ్లాలి. లేదంటే చెక్కుద్వారానో మరో రకంగానో చూసుకోవాలి. అంటే ఫిజికల్ మనీ వాడకం డిస్కరేజ్ అవుతోంది.
– డబ్బులు దగ్గర పెట్టుకొనే అలవాటు పైనే కాదు… లెక్కకి అందకుండా జారిపోతున్న లావాదేవీలపైనా దృష్టిపెట్టినట్టుంది కేంద్రం.
– ఇదో రకంగా కిచెన్ ఎకనామిక్స్. అంటే ఎక్కడి నంచో అప్పుతీసుకునే ముందు… అందుబాటులో ఉన్నదంతా పోగేసి, ఏదోరకంగా
పనికానిచ్చేయడం…. రెండు మూరు రకాలు కలగలిపి కొత్త కూర వండేయడం లాంటది. ఇవి చెప్పుకోడానికి బాగానే ఉంటాయ్. ఒప్పుకోవడం అంత ఈజీ కాదు. పైగా భరించడం అంటే బతుకు నరకంలా అనిపిస్తుంది. క్యూ లైన్లలా కనిపిస్తుంది.
– అయితే ఇది సగటు మనిషి పాలిట నరకప్రాయం. పప్పులు ఉప్పులు రోజువారీ సాదర అంతా చిల్లతోనే సాగాలి. దగ్గర రెండు వేలున్నా అవసరాలు తీరకపోతే ఏం లాభం ? సాగరం ఉన్నా దాహం తీరనట్టుగా అయిపోతోంది పరిస్థితి. అందుకే అక్రోశం భగ్గుమంటోంది.
– ఇంకోసంగతి. అందరూ ఆన్ లైన్ లో కార్డులోనో వాడాలంటే అయ్యేపని కాదు. రోజు కూలీ చేసేవాళ్లు, దిగువ మధ్యతరగతి ఏం గాను ? ఇందుకే ఇపుడు సగటు మనిషి ఆందోళన పడుతున్నది.
ఇవీ నాణేనికి రెండు వైపులు. ఓ వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకున్నప్పుడు దీర్ఘకాలిక ప్రభావాన్నే కాదు స్వల్పకాలిక సమస్యల్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇంత పెద్ద వ్యవస్థనీ దేశాన్నీ చపాతీ పిండి పిసికినట్టు పిసికి…కొత్త రొట్టె చేసేస్తా అని మొదలుపెట్టారు. ఆ రొట్టె చేయడానికి ఆర్నెల్లు పడుతుంది. మరి అప్పటి వరకూ తిండి ఎలా ? ఉండేదెలా ? ఇదే అసలు పాయింట్. ఖర్చులు తగ్గించాలంటే ముందు సానూకూల దృక్పథం కావాలి. ఇదీ సంగతి అర్థం చేసుకునే అవకాశమూ ఇవ్వాలి. ఇప్పుడు అది జరగలేదు. స్టేడియం రెడీ చేసిన మోడీ… ఆట ఆడటం ఎలాగో చెప్పకుండా లోపలికి వదిలారు జనాన్ని. కొందరు చేపలు పడుతున్నారు. ఇంకొందరు గోతులు తవ్వుతున్నారు. మరికొందరు మొత్తుకుంటున్నారు. మరిప్పుడు చక్కదిద్దడం ఎలాగో… సరిచేయడం ఎలాగో చూడాలి ఇది ఎమర్జెన్సీ !