Header Ads

ఎసిడిటీ సమస్య ఉందా? అయితే ఈ సింపుల్ రెమిడీ ఫాలో అయిపోండి…


ఎసిడిటీ సమస్య చెప్పుకోవడానికి పెద్ద సమస్యలా ఉండదు కాని అది చాలా అసౌకర్యంగా, బాధతోకూడినదిగా ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు అక్కడ అన్నీ రకాల స్పెషల్ చూడటంతో ఈ ఒక్కరోజుకే అని శుభ్రంగా తింటాము.  దీనివల్ల మరుసటి రోజు ఉదయం.. బ్లోటెడ్ టమ్మీ, పొట్ట నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ అజీర్ణాన్ని సూచించే లక్షణాలు. ఈ సమస్య రావడానికి కారణాలు ఏమిటంటే…
అన్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, ఒబేసిటీ, ఎసిడిటీ, అల్సర్స్, కాన్ట్సిపేషన్, మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇలా అనేక కారణాలు ఉంటాయి. దీని ప్రభావం మనపై ఎలా చూపుతుందంటే… బ్లోటింగ్, పొట్టనొప్పి, గ్యాస్, త్రేన్పులు, పొట్ట పెరగడం, వికారం, వాంతులు ఇలా పలురకాలుగా బాధ పెడతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధ పడితే దీనికి చక్కటి  ఒక హోమ్ రెమిడీ ఉంది. దీనిని చాలా ఈజీగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని ప్రభావం చాలా మంచి ఫలితం ఇస్తుంది. అది ఎలా తయారుచేయాలో నేర్చుకుందాం…

కావాల్సిన పదార్థాలు
బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం 2 టీస్పూన్లు
అల్లం రసం 2 టీస్పూన్లు
తయారు చేసే విధానం
పైన వివరించిన పదార్థాలన్నింటినీ ఒక కప్పులో వేసి కలిపి… కొద్దిగా నీటిని అందులో వేసి,మొత్తం బాగా మిక్స్ చేయాలి.

ఎలా వాడాలంటే…
ఈ మిశ్రమాన్ని రోజుకి రెండుసార్లు భోజనం తర్వాత తీసుకుంటే.. అజీర్ణం సమస్య నుంచి బయటపడవచ్చు. ఎప్పుడైనా మీరు ఇన్ డైజెషన్ సమస్యతో బాధపడితే  అప్పుడు ఈ డ్రింక్ తాగితే, మంచి ఫలితాలు ఇస్తుంది.

పాటించాల్సిన నియమాలు…
ఈ డ్రింక్ తాగుతూ,  స్పైసీ, ఆయిలీ ఫుడ్ ని తినకూడదు. ఆరిగ్యకరమైన ఆహారాన్ని డైట్ లో తీసుకోవాలి.

పదార్ధాలలో ఉండే లక్షణాలు…
 ఈ రెమెడీలో ఉపయోగించిన మూడు పదార్థాల్లోనూ ఎసిడిటీ తగ్గించే సత్తా ఉంటుంది. పొట్టలో ఎసిడిటీ తగ్గితే, ఎఫెక్టివ్ గా అజీర్ణం సమస్య నుంచి బయటపడవచ్చు.