Header Ads

ఆ రెస్టారెంట్ లో దుస్తులు తొలగించి మరీ (నగ్నంగా) భోజనం చేయచ్చు ఎక్కడో తెలుసా ?


భోజన ప్రియులకోసం లండన్ లోని ఓ హోటల్ కొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది. విభిన్న రుచులను చవి చూడాలనుకునేవారికోసం కొత్త పోకడకు తెర తీసింది. ఆహార ప్రియులను అమితంగా ఆకట్టుకునేందుకు ప్రత్యేక టాప్ అప్ లతో ఆహ్వానం పలుకుతోంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' పేరిట అన్ని ప్రత్యేకతలు కలిగిన థీమ్డ్ రెస్టారెంట్ ప్రారంభానికి స్థానిక ఔల్ కేఫ్.. శ్రీకారం చుట్టింది. లండన్ ప్రజలకు మరింత చేరువవ్వాలన్న కాంక్షతో ఔల్ కేఫ్.. కొత్త డైనింగ్ అనుభవాలను అందించేందుకు నేకెడ్ రెస్టారెంట్ ను ప్రారంభిస్తోంది. రెస్టారెంట్ డిన్నర్ లో అదనపు సౌకర్యంగా వినియోగదారులు 'బర్త్ డే డ్రెస్' లో భుజించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

ప్రపంచంలోనే ఇప్పటి వరకూ ఎక్కడా లేని అదనపు సౌకర్యాలను వినియోగదారులకు అందించేందుకు లండన్ నగరంలోని ఓ హోటల్ ముందుకొచ్చింది. ఇంతకు ముందు కాఫీ, స్నాక్స్, టీ తోపాటు హగ్స్ సౌకర్యాన్ని కూడ అందుకున్న అనుభవం కడిల్ కేఫ్ లో లండన్ ప్రజలకు ఉండగా, ఇప్పుడు ఔల్ కేఫ్ బర్త్ డే డ్రస్ (నగ్నంగా) తో భుజించే ఆఫర్ను తెరపైకి తెచ్చింది. నగరంలోని భూగర్భ రైల్వే నెట్వర్గ్ లండన్ ట్యూబ్.. కూడ ప్రస్తుతం పాప్ అప్ రెస్టారెంట్ గా మారిపోయింది. బ్రిటన్ రాజధానిలో భోజన ప్రియులకు ప్రత్యేక అనుభూతులను అందించేందుకు విభిన్నంగా ఆలోచించిన సంస్థ.. వినియోగదారులు.. భోజనానికి దుస్తులు తొలగించి మరీ (నగ్నంగా) కూర్చునే ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. విడిచిన దుస్తులు, ఇతర ఖరీదైన వస్తువులు భద్రపరచుకొనేందుకు హోటల్ ప్రత్యేక లాకర్ల వసతిని కూడ కల్పిస్తుందట. అయితే భోజనానికి దుస్తులు విప్పి కూర్చోవాలా, ఉంచుకొని కూర్చోవాలా అన్న ఎంపికను మాత్రం వినియోగదారుల ఇష్టానికే వదిలేసింది. గోప్యతకు వీలుగా రెస్టారెంట్లో బ్యాంబూ పార్టిషన్లతోపాటు ప్రత్యేక స్థలాన్ని కేటాయించిందట. అయితే ఇక్క్డడి సభ్యులు, సిబ్బంది కూడ కురుచ దుస్తులే ధరించి ఉంటారని ఓ అంచనా.

బున్యాది పేరుతో ఈ కొత్త రకం రెస్టారెంట్ సెంట్రల్ లండన్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ లభించే ప్రత్యేక సౌకర్యాలు, డిన్నర్లు, వంటి అనుభవాలను రుచి చూసేందుకు ముందుగా బున్యాది డాట్ కామ్ (thebunyadi.com) లో రిజిస్టర్ చేసుకోవచ్చట. ఇప్పటికే 4000 మందికి పైగా ప్రజలు ఈ కొత్త భోజనశాలను పరీక్షించేందుకు సైన్ అప్ చేశారట. దుస్తుల సంకెళ్ళనుండి విముక్తులను చేయడం, ఆధునిక జీవితంలో సరికొత్త అనుభవాలను చవి చూసేందుకు వీలుగా ఈ రెస్టారెంట్ ఉంటుందట. ఇక్కడ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు వంటివి ఉపయోగించే వీలు ఉండదట. ఎక్కువ కాంతి లేకుండా డిమ్ లైట్ (క్యాండిల్ లైట్) లోనే డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయని నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాదు పూర్వ కాలపు పద్ధతిలో వంటకాలను కట్టెల పొయ్యిపై వండటం, మట్టి పాత్రలతో వడ్డించడం వంటివి కూడ ఇక్కడి సౌకర్యాల్లో భాగమే. అయితే ఎటువంటి వంటకాలను అందిస్తారో ఇంకా మెనూ సిద్ధం కాకపోయినప్పటికీ శాఖాహార, మాంసాహార పదార్థాలైతే తప్పనిసరిగా ఉంటాయని మాత్రం తెలుస్తోంది. ఈ రెస్టారెంట్లో 'నేకెడ్'' మాత్రమే కాదు 'నాన్ నేకెడ్' సెక్షన్ కూడ సెపరేట్ గా ఉంటుందట. సో... ఇంకెదుకాలస్యం... కొత్త అనుభవాలను చవి చూడాలనుకుంటే మీరూ ఈ వెయిటింగ్ లిస్గులో రిజిస్టర్ అయిపోవచ్చు. ఆల్ ది బెస్ట్....