Header Ads

భూకంపం లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించి చనిపోయిన కుక్క

కుక్క విశ్వాస జంతువు అనే సంగతి మనకు విధితమే.. కాగా ఓ కుక్క ఏడుగురి ప్రాణాలను కాపాడిన కొద్ది సేపటికే ప్రాణాలను కోల్పోయిన సంఘటన అందరినీ కలచి వేసింది. వివరాల్లోకి వెళ్తే...

ఇటీవల ఈక్వెడార్ లో భారీ భూకంపం సంభవించిన సంగతి విధితమే.. ఈ భూకంప లో సుమారు 700 వందల మంది వరకూ మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.. శిధిలాల క్రింద వందలాది మంది చిక్కుకున్నారు. కాగా శిధిలాల క్రింద చిక్కుకున్న వారిని రక్షించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఆ చర్యల్లో భాగంగానే మనిషి శ్వాస, వాసన ఆధారంగా మనిషి ఎక్కడ ఉన్నాడో అని గుర్తుపట్టే డెకో అనే కుక్క కూడా విధుల్లో పాల్గొంది. శిధిలాలపై తిరుగుతూ క్షతగాత్రులను గుర్తుపట్టింది. అలా శిధిలాల క్రింద చిక్కుకొని ప్రాణాల కోసం పోరాడుతున్న ఏడుగురిని గుర్తించింది.. వెంటనే పోలీసులు సహాయ సిబ్బంది వారిని శిధిలాల నుంచి కాపాడారు. కాగా డెకో నిరంతరంగా శిధిలాల మధ్య ఎత్తుపల్లాల పై తిరగడంతో శ్వాస కోస సంబంధిత సమస్య ఏర్పడి... కొద్ది సేపటికే గుండెపోటు వచ్చి మరణించింది. ఏడుగురికి ప్రాణాలను కాపాడి.. డెకో మరణించడం అక్కడ ఉన్న వారందరినీ కలచి వేసింది.