రెండు తలల శిశివు జననం
ప్రపంచ వ్యాప్తంగా అనేక వింత సంఘటనలు చోటు చేసుకొంటున్నాయి. గేదె కడుపున మొసలి పుట్టడం.. మనిషి కడుపున ప్లాస్టిక్ బేబీ పుట్టడం.. పంది కడుపున ఏనుగు పుట్టడం వంటి అనేక వింతలు చోటు చేసుకొంటూనే ఉన్నాయి. కాగా ఒరిస్సా లో ఓ తల్లి రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. ఈ పాప పుట్టిన కొద్దిసేపటికే మరణించడం గమనార్హం.. వివరాల్లోకి వెళ్తే... ఒరిస్సా రాష్ట్రంలోని కుర్దా జిల్లా అభయ్ ముఖి బ్లాక్ చెందిన రోశలిన్ సత్పతి అనే మహిళా గర్భవతి అయ్యింది మొదలు వైద్యులతో రొటీన్ చెకప్ చేయించుకొంటూనే వస్తుంది. కాగా ఈ గురువారం రాత్రి ఆ మహిళకు పురుటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా శనివారం సిజరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. కాగా ఈ శిశివు రెండు తలలతో ఉంది.. మిగిలిన శరీరం అంతా మనిషిలాగే ఉంది. ఈ బిడ్డ ఆడబిడ్డ. ఈ రెండు తలల శిశివు 12 నిమిషాలు మాత్రమే బతికి ఉంది. కాగా తల్లి గర్భంలో పిండంగా పెరిగిన సమయంలో కూడా రెండు తలలు ఉన్నట్లు అలట్రా ఫోటోగ్రఫీకి కనిపించలేదు.
