Header Ads

తల మనిషిది... మిగిలిన శరీరమంతా మేకది


ప్రపంచం ఎంతో అందమైంది. దాంతో పాటు కొంత వింతైనది కూడా. అలాంటి వింతలువిచిత్రాలు తెలుసుకుని ఔరా అని ఆశ్చర్యపోవడం మన వంతు. మనకిప్పుడు ఆ సమయం వచ్చింది. దక్షిణ మలేషియాలోని ఫెల్డా అనే గ్రామంలో ఓ రైతు మేకలను పెంచుకుంటున్నాడు. ఆ మేకల్లో ఒకటి ఓ వింత జీవికి జన్మనిచ్చింది. మొండెం వరకూ మేకలాగానే ఉంది. ఆ పైన తల మాత్రం మనిషిని పోలి ఉంది. ఈ వింత జీవిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అయితే ఇది పుట్టిన కొద్దిసేపటికే చనిపోయింది. ఆ జీవిని శాస్త్రవేత్తల పరిశోధనకు తరలించారు.