Header Ads

నిద్రలేచిన నగ్న శవం! చెమటలు కక్కిన సిబ్బంది!


మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుందని అంటారు. కొందరు చనిపోయిన తర్వాత తిరిగి లేచి... నేను దేవుడ్ని చూసాను అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంచుమించు ఇలాంటి ఘటనే పోలండ్‌ లో జరిగింది. ఓ పబ్ లో కామిల్ అనే వ్యక్తి పీకల దాకా మద్యం సేవించి కుప్పకూలిపోయాడు. కామిల్ ని చూసి షాక్ తిన్న అతని స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. జరిగిందంతా వైద్యులకి వివరించారు. కాని కామిల్ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. సమయానికి కుటుంబ సభ్యులెవరు అందుబాటులో లేకపోవడంతో తన శవాన్ని మార్చురీలో పెట్టారు.


అదే రోజు రాత్రి మార్చురీ నుండి పెద్ద పెద్ద అరుపులు, శాభ్దాలు వినిపించాయి. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డ్ ఒక్కడే ఉండడంతో... అతనికి చెమటలు పట్టేసాయి. వణుకుతూ మార్చురీ తలుపులు తెరిచాడు. అంతే... నగ్నంగా పడుకొని ఉన్న కామిల్ శవం... దుప్పటి కావాలి చలేస్తుంది.. అని అడగడంతో సెక్యూరిటీ గార్డ్ కి ప్రాణం పోయినంత పనైంది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసి వైద్యులను పిలిచాడు. ఆ తర్వాత కమిల్‌ కి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతను చనిపోయిన మాట అవాస్తవం అని తేల్చారు.