Header Ads

కన్నతల్లి కోసం తన శీలాన్ని అమ్మకానికి పెట్టింది... జీవితాంతం మీరు ఏం చెపితే అది చేస్తాను..


నవమాసాలు కని పెంచిన తల్లిని కేన్సర్‌ మహమ్మారి కబళించేస్తోంది. కళ్ల ముందే తల్లి మంచం పట్టి మృత్యువుకు చేరువవుతున్నా... చికిత్స చేయించలేని దీనావస్థ ఆ యువతిది. దీంతో మాతృమూర్తిని అలా చూస్తూ ఉండలేక తనను తానే అమ్మకానికి పెట్టుకుంది దక్షిణ చైనాలోని గవాంఝుకు చెందిన యువతి. ఆమె పేరు కావో మేంగ్యువాన్‌ (19). ఆమెది ఓ సాధారణ రైతు కుటుంబం. వ్యవసాయం చేసి ఐదుగురు పిల్లలను పోషిస్తూ వచ్చిన ఆమె తల్లి వూ ఝావ్‌ఫాంగ్‌ (45) ఇటీవల చర్మ కేన్సర్‌తో మంచం పట్టింది. ఆమెకు చికిత్స చేయించాలంటే సుమారు రూ.28 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అయితే, అంత మొత్తం వెచ్చించే స్థోమత వారికి లేదు. దీంతో ఐదుగురు పిల్లలలోనూ పెద్దదైన కావో తన తల్లికి చికిత్స చేయించే బాధ్యత తీసుకుంది. ఏ దారీ లేక తన తాను అమ్మకానికి పెట్టుకుంది. చైనా సోషల్‌ మీడియా సైట్‌ ఉయ్‌చాట్‌లో ఈ మేరకు ప్రకటన చేసింది. తన తల్లికి చికిత్స కోసం రూ.28 లక్షలు అవసరమని, ఎవరు ఎక్కువ మొత్తం ఇస్తే... జీవితాంతం వారు చెప్పినట్లుగా నడుచుకునేందుకు సిద్ధమని తెలిపింది. ఈ ప్రకటన చూసిన ఓ వ్యక్తి ఇప్పటికే ఆమె సాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం.