Header Ads

ఈ నోటు గురించి ఎంత మందికి తెలుసు...దీని ప్రత్యేకత ఏంటి? అసలు ఇలాంటి నోట్ ఉన్నదని విన్నారా??


ఒక్క రూపాయి నోటు నుంచి 2వేల నోటు వరకు చూసింటారు. గతంలో ఆర్‌బీఐ ప్రింట్ చేసిన అతిపెద్ద కరెన్సీ నోట్లుగా రూ.10,000 నోట్లు ఉండేవి. ఇవి 1938 నుంచి 1954 మధ్య కాలంలో వాడుకలో ఉండేవి. ఇదంతా పక్కన పెడితే.. రూ. జీరో నోటును చూశారా? కొందరు చూసే ఉంటారు. కానీ చాలామందికి దీని గురించి తెలియదు.

ఫిఫ్త్ పిల్లర్‌ పేరుతో ఏర్పాటైన ఓ స్వచ్చంద సంస్థ ఈ జీరో నోట్ల ముద్రణను 2007లో ప్రారంభించింది. అవి పూర్తిగా 50 రూపాయల నోట్లను పోలివుంటాయి, గాంధీ బొమ్మతో అదే రంగులో..కానీ,అవి విలువ లేనివని వాటిపై ముద్రణ ఉంటుంది. ఎవరైనా అధికారి లంచం అడిగితే పౌరులు దాన్ని ఇవ్వాలి. 'నేను లంచం ఇవ్వను, తీసుకోనని ప్రమాణం చేస్తున్నా' అనే హెచ్చరిక ఆ నోట్‌పై ఉంటుంది. ఇటువంటి నోట్‌ అధికారులకిచ్చినపుడు తమ డిమాండ్‌ చట్ట విరుద్ధమన్న అవమానకర భావన వాళ్లలో కలుగుతుందన్నదే దీని ప్రచారకర్తల ఆలోచన. దీని ద్వారా వారు సాధించిన ఫలితాలపై అనేక కథనాలను ఆ సంస్థ తమ వెబ్‌సైట్‌లో కూడా పెట్టింది. అవినీతిపరుల్లో ఈ ప్రక్రియ మార్పు తెచ్చిందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక్కడ సాధించిన విజయం అవినీతి ప్రమాదకరస్థాయిలో ఉన్న నేపాల్‌, ఘనా, బెనిన్‌, మెక్సికో, యెమెన్‌వంటి దేశాలపైనా ప్రభావం చూపింది. ఐతే, దీని ద్వారా నిజమైన మార్పు సాధ్యమా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. లంచగొండితనంపై ఫిఫ్త్ పిల్లర్ అధ్యక్షుడు విజయ్ ఆనంద్ నిర్వహిస్తున్న పోరాటం మాత్రం అభినందనీయమే