Header Ads

ప్రపంచంలో హిందువులకు చెందిన అతి పెద్ద ఆలయం ఇదే..! కానీ ఇది ఇండియాలో లేదు.. ఆ ఆలయంలో ఎన్నో అద్భుతాలు


దేవాలయాలకు పెట్టింది పేరు భారత దేశం. హిందు, ముస్లిం, క్రిస్టియన్లకు చెందిన ఎన్నో దేవాలయాలు, మసీదులు , చర్చిలు భారత దేశంలో కొలువై ఉన్నాయి. భారత దేశంలో హిందువులకు చెందిన దేవాలయాల సంఖ్య ఎంతో చెప్పడం ఎవరి వల్ల కాదు. అంతలా హిందువుల ఆలయాలకు భారత దేశంలో ఓ స్థానం ఉంది. కానీ ప్రంపంచంలోకెళ్లా పెద్ద హిందువుల ఆలయం ఇండియాలో లేదు.

హిందువులకు చెందిన ఆ దేవాలయం ఇండియాలో కాకుండా కాంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్‌లో ఉంది. ఆ అలయంలో శ్రీ మహా విష్ణువు కొలువై ఉన్నాడు. ఈ ఆలయం ప్రపంచంలోనే పెద్ద హిందు ఆలయంగా చరిత్రకెక్కింది. 12వ శతాబ్ధంలో సూర్యవర్మన్ అనే రాజు దీనిని నిర్మించారు. ఈ ఆలయం హిందువుల నిర్మాణ శైలిలో కాకుండా క్మేర్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. కానీ శిల్పాకళా నైపుణ్యం మాత్రం హిందూ సాంప్రదాయంగా ఉంటుంది. ఆలయ నిర్మాణంలో అక్కడక్కడ తమిళనాడులోని ఆలయాలకు చెందిన శైలి కనిపిస్తుంది. భారత దేశంలో మనం చెప్పుకుంటున్న ఇతిహాసాలను కూడా తనలో చూపిస్తూ ఎంతో ఆకట్టుకుంటుంది ఈ ఆలయం. శ్రీ మహా విష్ణువు కొలువైన ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయం విస్తీర్ణం కూడా సుమారు 200 చ.కీ.మీ ఉంటుందట. ప్రపంచంలో ఎక్కడైనా నీళ్లు ఎగువ నుంచి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తాయి... కానీ ఈ ఆలయం వద్ద మాత్రం నీళ్లు దిగువ నుంచి ఎగువ ప్రాంతానికి ప్రవహిస్తాయట. అలా ఎందుకు జరుగుతోందనని ఇప్పటికీ  మన శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు. అంత ప్రత్యేకత ఉంది కాబట్టే కంబోడియా దేశ జాతీయ పతాకంలో ఈ దేవాలయానికి స్థానం దక్కింది. హిందువులకు చెందిన ఆలయం మరోక దేశ జాతీయ పతాకంపై ఎగురుతుండటం ఎంతో సంతోషాన్ని ఇచ్చినా... అదే ఆలయం ఇండియాలో లేకపోవడం కొంత వరకు బాధాకరమే.