Header Ads

రాత్రిపూట ఫోన్‌ వాడుతున్నారా ? అయితే జాగ్రత్త కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది


రాత్రిపూట స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగిస్తున్నారా.. అయితే కాస్త జాగ్రత్త!! ఈ అలవాటుకు స్వస్తి చెప్పకపోతే కొంతకాలం తర్వాత కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ తరహా కేసులు రెండు లండన్‌లో నమోదయ్యాయట! పడుకునే ముందు స్నేహితులతో చాటింగ్‌ చేయడమో లేక వీడియోలు చూడడం వల్ల తాత్కాలిక అంధత్వంతో బాధపడే ముప్పు పొంచి ఉందని వారు వివరించారు. ఈ రెండు కేసులలో.. బాధితులు ఒక కన్ను సరిగా కన్పించడంలేదంటూ తమను సంప్రదించినట్లు తెలిపారు. చూపును పరీక్షించడంతో పాటు వారి అలవాట్లను పరిశీలించాక ఈ విషయం వెల్లడైందన్నారు. వారికి రాత్రిళ్లు స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే అలవాటు ఉంది. బెడ్‌ మీద ఒకవైపు తిరిగి పడుకొని స్మార్ట్‌ఫోన్‌ చూస్తున్నపుడు ఒక కన్ను ఫోన్‌ తెరపై ఉండగా.. మరో కన్నుకు తలగడ అడ్డుగా ఉండటం వల్ల ఒక కన్ను సాధారణంగా పనిచేస్తే, మరో కన్ను మాత్రం స్మార్ట్‌ఫోన్‌ తెర వెలుగుకు అలవాటు పడిందని చెప్పారు. ఫలితంగా.. కొంతకాలానికి ఆ కంటిచూపు దెబ్బతిన్నదని వారు వివరించారు.