Header Ads

రోజూ పామును కౌగలించుకుని పడుకుంది.. తర్వాత డాక్టర్ ని కలిస్తే ఆమెకు షాక్ ఇచ్చాడు!!


చాలా మంది తమకు ఒంటరిగా ఉండటం ఇష్టంలేక తోడుగా కుక్కనో, పిల్లినో, లేదా ఏవైనా పక్షులనో పెంచుకుంటారు. కానీ ఒక మహిళ మాత్రం ఏకంగా ఒక కోడచిలువను తన ఇంటికి తెచ్చుకొని పెంచుకుంది. దానికి ఏం కావాలో తిండిని పెట్టి పెంచుకుంది. అంతటితో ఊరుకుందా..? రోజూ రాత్రిపూట తన బెడ్ మీద బట్టలు లేకుండా పడుకునే ఆ మహిళ, ఆ పామును పెనవేసుకొని పడుకునేది. అలా చాలా రోజులు గడిచింది. ఒక రోజు మాత్రం షడన్ గా ఆ పాము ఆహారం తినడం మానేసింది. కానీ రాత్రి పూట మాత్రం ఎప్పటిలాగానే తనను పెనవేసుకుని పడుకునేది.

దీంతో తన పాముకి ఏమైందో అన్న దిగులుతో దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ వద్దకు వెళ్లి చూపించింది. ఆ పామును గమనించిన సదరు డాక్టర్ ను ఊహించని నిజాన్ని కనుక్కున్నాడు. నువ్వు ఈ పాముతో రోజూ కలసి పడుకుంటున్నావా అని అడిగాడు. దానికి ఆ మహిళా అవును అని చెప్తుంది. దీంతో అసలు విషయం అర్ధం చేసుకున్న డాక్టర్ ఆ విషయాన్ని ఆ మహిళకు చెప్పాడు.

ఆ కొండ చిలువ ఆ మహిళను మింగేయాలని ప్లాన్ చేసిందట! రోజు చుట్టుకుని పడుకోవడానికి అసలు కారణం ఆ మహిళ ఎంత సైజ్ ఉంది, ఎంత సేపట్లో మింగగలను అనే అంచనాలు వేసుకుంటుందట! ఇంకో కొన్ని రోజులు ఇలా ఉంటే ఖచ్చితంగా అన్నంత పని జరిగేదని చెప్పారు డాక్టర్. అందుకే అది గత కొన్ని రోజులుగా ఏమీ తినకుండా పొట్ట ఖాళీగా ఉంచుకునేదని కూడా గ్రహించారు.

వెంటనే షాక్ కు గురైన ఆ మహిళ ఆ పామును దూరం పెట్టేసిందట. పెంచుకున్న వాటన్నిటికీ కుక్కలాగా విశ్వాసం ఉండాలంటే ఎలా ఉంటుంది? అందుకే ఆ పాము బుద్ధి బయటపడింది. కాబట్టి..పెంపుడు జంతువుల్ని కానీ..ఇతర ఏవైనా పెంచుకునేటప్పుడు వాటిపై ఒక కన్నేసి ఉంచాలని ఇదిగో ఈ సంఘటనే చెప్తుంది కదా.