Header Ads

ఎదుటి వ్యక్తి చెప్పేది అబద్ధమా లేక నిజామా తెలుసుకోడానికి అమేజింగ్ ట్రిక్!

అబద్ధానికి, నిజానికి మధ్య ఓ సన్న గీత ఉంటుంది. ఇద్దరి మధ్య స్నేహాన్ని పెంచే శక్తి ఆ సన్న గీతకు ఉంటుంది... అలాగే ఇద్దరి మధ్య వైరాన్ని పెంచి శత్రువులను చేసే సత్తా కుడా ఆ సన్న గీతకు ఉంటుంది. కొందరు ఎంత ప్రయత్నించినా అబద్ధం చెప్పలేకపోతారు. ఒకవేళ చెప్పినా వెంటనే దొరికిపోతారు. ఇంకొందరు యిట్టె అబద్ధాలు చెపేస్తారు. ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతవరకు వీరిని దూరంగా పెట్టాలి. మరి వారిని దూరం పెట్టాలంటే.. అసలు వారు చెప్పేది నిజమో లేక అబద్ధమో తెలియాలి కదా..?? ఎందుకంటే వీరు చెప్పే అబద్ధం అతికించినట్టు కూడా కనిపించదు..!

ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఓ చిన్న ట్రిక్ ని ఫాలో అయిపోవాలి. ఇది సాధారణమైన ట్రిక్ కాదు....! ఎంతో మంది పై ప్రయోగించిన ట్రిక్. ఈ ట్రిక్ తో ఎదుటి వ్యక్తి మీతో చెప్పేది అబద్ధమా లేక నిజామా అనేది పసిగట్టచ్చు. ఎవరైనా మీతో మాట్లాడేటప్పుడు... అతను చెప్పే విషయం మీకు సరిగ్గా అర్ధం కాడానికి తన చేతులు ఎక్కువగా కదుపుతున్నాడంటే తను చెప్పేది నిజం అని అర్ధం. అలాగే తను మీకు వివరించేటప్పుడు అతని చేతులు ఎక్కువ కదపకుండా స్టేడిగా ఉన్నాయంటే తను చెప్పేది అబద్ధమని అర్ధం...! ఈ ట్రిక్ తో ఎదుటి వ్యక్తి చెప్పేదాంట్లో ఎంతవరకు నిజముందో తెలిసిపోతుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి..!

ఇలాంటి మరిన్ని ఇంటరెస్టింగ్ టాపిక్స్ ని మీ ముందుకు తెచ్చేందుకు ఫేస్ బుక్ లో మా పేజీని లైక్ చేయడం మరువకండి...!! అలాగే ఈ పోస్టుని ఇతరులతో షేర్ చేయండి..!!