Header Ads

ఈ 20 పరిణామాలు గనుక మీ చుట్టూ జరుగుతున్నట్లయితే త్వరలో చనిపోతారనడానికి శకునాలు


ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే.. దుశ్శకునంగా భావిస్తారు. కాని ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు మృతదేహం ఎదురవుతే శుభ శకునం అంటారు. ఇలా ఎన్నో మూఢ నమ్మకాలను మన దేశంలో ఇప్పటికి పాటిస్తారు. ఇలాంటి మూఢ నమ్మకాలను పక్కకు పెడితే... మన ప్రాచీన గ్రంధాలు, శాస్త్రాలు, వేదాలలో ఎన్నో విషయాలు రచించారు. వీటిలో ధర్మ, కర్మ, కామ, మోక్ష, జీవనం, మరణం, మరణానంతర రహస్యాల గురించి ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం లభిస్తుంది. వీటన్నిటిలో కల్లా ప్రతి ఒక్కరు భయపడేది.. అలాగే తెలుసుకోవాలనుకునే విషయాలు రెండు ఉంటాయి. అవే మరణం మరియు మరణానంతరం. మరణం అనేది మన చేతిలో లేదని తెలిసినా... దాని గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు తహతహలాడుతూ ఉంటారు. మన చుట్టూ జరిగే పరిణామాలను బట్టే మన మరణం కూడా ముందే పసిగట్టే వీలు ఉంటుందని మన పురాణాల చెబుతున్నాయి. ఇప్పుడు మేము చెప్పబోయే 20 పరిణామాలు గనుక మీ చుట్టూ జరుగుతున్నట్లయితే మరణం త్వరగా సంభవిస్తుందని కూడా పురాణాల చెబుతున్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

ఎవరైతే ధ్రువ నక్షత్రం (pole star) చూడలేకపోతారో వారు 1 సంవత్సరంలో చనిపోతారట.

సూర్యుడు ఫేడ్ అయినట్టు లేదా గజిబిజిగా కనిపిస్తే 11 నెలల్లో చనిపోతారట.

ఇసుక మీద లేదా దుమ్ము మీద పాదాల అచ్చులు పూర్తిగా కనిపించకపోతే వారు 7 నెలల్లో చనిపోతారట.

రాబందు, కాకి లేదా పావురం తలపైన దిగడానికి ప్రయత్నిస్తుంటే వారు 6 నెలల్లో చనిపోతారట.

ఓ వ్యక్తి చుట్టూ అకస్మాత్తుగా ధూళి మేఘం ఏర్పడినా లేదా ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబం గజిబిజిగా కనిపించినా ఆ వ్యక్తి 4 లేదా 5 నెలల్లో చనిపోతారట.

మబ్బులు లేకుండానే ఆకాశంలో మెరుపులు చూసినా లేదా నీటిలో ఇంద్రధనుస్సు చూసినా ఆ వ్యక్తి 2 లేదా 3 నెలల్లో చనిపోతారట.

ఓ వ్యక్తి తన ప్రతిబింబంను తల లేకుండా చూస్తే ఆ వ్యక్తి నెల రోజుల్లో చనిపోతారట.

ఎవరికైనా మృతదేహం యొక్క దుర్వాసన వస్తుంటే వారు 15 రోజుల్లో చనిపోతారట.

స్నానం చేసిన తర్వాత కూడా పాదాలు పొడిగా ఉంటె ఆ వ్యక్తి 10 రోజుల్లో చనిపోతారట.

తలలోంచి పొగలు వస్తున్నట్టు కనిపించినా ఆ వ్యక్తి 10 రోజుల్లో చనిపోతారట.

ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరకపోతే ఆ వ్యక్తి త్వరలో చనిపోతారట.

ఎలుగుబంట్లు లేదా కోతులు తోలుతున్న రథంలో దక్షిణ దిక్కుకి ప్రయానిస్తున్నట్టు కలలో కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలో చనిపోతారట.
నల్ల దుస్తులు ధరించిన మహిళ పాట పాడుతూ, రథం తోలుతూ దక్షిణ దిక్కుకి ప్రయానిస్తున్నట్టు కలలో కనిపించినా ఆ వ్యక్తి త్వరలో చనిపోతారట.

చిల్లులు పడిన నల్ల దుస్తులను ధరించినట్టు కలలో కనిపించినా ఆ వ్యక్తి త్వరలో చనిపోతారట.

బొగ్గు, బూడిద, జుట్టు, ఎండిపోయిన చెరువుల గురించి కలలు గనినా ఆ వ్యక్తి 10 రోజుల్లో చనిపోతారట.

దీపం కొండెక్కినప్పుడు... అందులోని ఒత్తు కాలి ఒక వింత వాసన వస్తుంది. ఆ వాసన గ్రహించలేకపోతే ఆ వ్యక్తి త్వరలో చనిపోతారట.

రాత్రి పూట ఇంద్రధనుస్సుని చూసినా త్వరగా చనిపోతారట.
సొంత ప్రతిబింబంను ఎదుటివారి కళ్ళల్లో చూసుకోలేకపోతే త్వరగా చనిపోతారట.

నాలుక గరుకుగా, నల్లగా మారి.. ఒక కంటి నుంచి తరచుగా నీరు కారుతుంటే త్వరగా చనిపోతారట.

స్నానం చేసిన తర్వాత పళ్ళు వణుకుతునే ఉంటె ఆ వ్యక్తి త్వరలో చనిపోతారట.