Header Ads

ప్రేమించే భర్త, చక్కటి పిల్లలు ఉన్నారు...ఆఫీసు పని మీద ఒక వ్యక్తిని కలిశా..ఆ పని తప్పని తెలుసు..కానీ అతను కావాలనిపిస్తోంది

                   [ ప్రశ్న - జవాబు శీర్షికకు స్వాగతం ]

ప్రశ్న:- 
నాకు ప్రేమించే భర్త, చక్కటి పిల్లలు ఉన్నారు... హాయిగా జీవితం సాగుతుంది. నా భర్తతో చిన్న చిన్న గొడవలు అయినా, మేము వాటిని మేం పట్టించుకోం. నేను ఓ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాను. కొన్ని రోజుల క్రితం నేను ఆఫీసు పని మీద మరో ఊరు వెళ్లాను. అక్కడ ఒక వ్యక్తిని కలిశా. చాలా మంచి వాడు. చూడటానికి బాగున్నాడు. నాకు అతని మీద ఆసక్తి కలిగింది. దీనితో ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. సొంత ఊళ్లకు చేరాక మా స్నేహం కొనసాగింది. అతనికి కూడా పెళ్లయి, పిల్లలున్నారు. రోజూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నాం.

ఆ తరువాత మా మాటలు హద్దులు దాటాయి. ప్రేమ, సెక్స్, వివాహేతర సంబంధాలు ఇలా అన్నిటి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మా ఇద్దరం ఏదో బంధాన్ని కోరుకుంటున్నట్టు అనిపిస్తోంది. అలాగని మా వివాహ సంబంధాలను మాత్రం తెంపుకోలేము. కానీ.. దూరంగా ఉండలేకపోతున్నాము. అతని మాటల ద్వారా శారీరక సంబంధాన్ని కోరుకుంటున్నాడని అర్థమైంది. నాకు కూడా అతను కావాలనిపిస్తోంది. ఆ పని చేయడం తప్పని తెలుసు. కానీ ఎలా ఆ ఆలోచనలను ఆపాలో? ఏం చేయాలో అర్థం కావడం లేదు.

మానసిక వైద్యుల సలహా :-
మీరు రాసిందంతా చదివాక నాకు ఒక విషయం పూర్తిగా అర్థమైంది. మీరే చేజేతులా ఆనందకరమైన మీ సంసారాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లయి, పిల్లలు పుట్టాక కూడా ఇలా బయటి వ్యక్తులకి ఆకర్షితులవడం మీలోని బలహీనతగా చెప్పవచ్చు. మీరు వెంటనే ఆ వ్యక్తితో మాట్లాడడం మానేయండి. పూర్తిగా అతనికి దూరం అవ్వండి. అదే మీ జీవితానికి, అతని జీవితానికి కూడా మంచిది. మీ భర్తే మీలా వేరే మహిళతో సంబంధం పెట్టుకోవాలనుకుంటే మీ పరిస్థితి ఏంటి? మీ పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించండి... వారిని సక్రమమైన దారిలో పెట్టాల్సిన మీరే ఇలా తప్పుడు దారుల్లో నడవాలనుకోవడం మంచిది కాదు.