తల్లి గర్భంలో పిండం, పిండం గర్భంలో మరో పిండం.. వినడానికి వింతంగా ఉన్న నిజం ఇది.. ఒక్కసారిగా వైద్యులు షాక్
ఈ అపూర్వ సృష్టిలో వింతలెన్నో.. మనిషిని బ్రతికించే ఊపిరిని సైతం కృత్రిమంగా సృష్టించిన ఘనత మనిషిది. సృష్టికి ప్రతి సృష్టి చేసిన మనిషి ఇంకా ఈ సృష్టిలోని ఎన్నో అద్బుతాలను తెలుసుకోలేకపోతూనే ఉన్నాడు.. అలాంటి మరో అద్బుతమే ఇది. తల్లి గర్భంలో పిండం, పిండం గర్భంలో మరో పిండం వినడానికి వింతంగా ఉన్న నిజం ఇది. వైద్యులనే విస్మయానికి గురి చేసిన సంఘటన ఇది. హాంకాంగ్ లో జరిగిన ఘటన ప్రపంచాన్ని ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ ఆడశిశువు పుట్టుకతోనే గర్భవతై వైద్యులను సైతం విస్మయపరిచింది. అంతే కాదు ఆ చిన్నారి గర్భంలో కవలలున్నారని తెలిసి వైద్యులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇలా జరగడం వైద్య చరిత్రలో ఇదే తొలిసారని… అసలు ఈ సంఘటనని ఏమని పిలుస్తారో కూడా తెలియందంటున్నారు వైద్యశాస్త్రవేత్తలు.
ఎనిమిది లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇలా జరగడానికి గల కారణాలను తెలుసుకుంటామని.. చిన్నారిని అబ్సర్వేషన్ లో ఉంచమని చెపుతున్నారు హంకాంగ్ వైద్య నిపుణులు. అసలు ఈ వింత ఎలా చోటు చేసుకుందంటే.. తల్లి గర్భంలో ఉండగానే ఆ శిశువు కడుపులో రెండు పిండాలు ఉన్నాయంటా. ఆ విషయం ఎనిమిది నెలల సమయంలో తెలిసిందని.. పాప పుట్టాక మరో సారి స్కానింగ్ తీయించగా.. ఆ చిన్నారి గర్భంలోని పిండాలకు పది వారాల వయసున్నట్టు తేలిందని చెపుతున్నారు వైద్యులు. అచ్చం తల్లి గర్భంలో ఎలా పిండం ఎదుగుతుందో పాప గర్భంలో కూడా అలాగే జతుగుతున్నట్టు వైద్యులు కనుగొన్నారు.
ఇప్పటికే ఆ కవలలకి చర్మం, మెదడు కణాలు, పక్కటెముకలు, పేగులు ఏర్పడినట్టు వైద్యులు తెలిపారు. అయితే పాప ఆరోగ్యం మీద ప్రభావం చూపే అవకాశాలు ఉండటంతో చిన్నారికి మూడు వారాల వయసు రాగానే వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆ పిండాలను తొలగించారు. వీటిలో ఓ పిండం బరువు 14.2 గ్రా. ఉండగా, మరొక పిండం బరువు 9.3 గ్రా. ఉందంటా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరిశోధన సాగిస్తోంది.
