ఒకప్పుడు అలా.. ఇప్పుడు ఇలా !!! ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం జీవితాన్నే మార్చేసింది.. ఈ యువతి జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శం షేర్ చేయండి
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. పట్టుదలతో ప్రయత్నిస్తే మనిషి సాధించలేనిది ఏదీ ఉండదు. ఇవన్నీ నీతి సూక్తులే కానీ నిజ జీవితంలో సాధ్యపడవనేది కొందరి అభిప్రాయం. కానీ సంకల్పం బలంగా ఉంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా జీవితంలో విజయం సాధించొచ్చనే విషయానికి ఎంతోమంది జీవితాలు సాక్షీభూతాలుగా నిలుస్తాయి.
శివంగి అనే ఈ యువతి జీవితం కూడా అలాంటిదే. కాన్పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న దెహ గ్రామం ఈ యువతి స్వస్థలం. చదువుకోవాలన్న ఆసక్తి ఉంది. చదువులో అందరి కంటే ముందుంటుంది. కానీ ఉన్నత చదువులు చదువాలంటే స్థోమత లేదు. చిన్న బంకు పెట్టుకుని తండ్రి పాత న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్లు అమ్ముతుంటాడు. నిరుపేద కుటుంబం. తండ్రితో పాటు పేపర్లు అమ్ముతూ చేదోడువాదోడుగా ఉంటోంది. ఆమె స్కూల్ చదువంతా సర్కారీ బడిలోనే సాగింది. ఒకరోజు ఆమె ఆనంద్ కుమార్ సూపర్ 30 అనే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌కు సంబంధించి పేపర్‌లో ఓ ఆర్టికల్ చదివింది. పేదరికంతో బాధపడుతూ చదువులో ప్రతిభ కనబర్చే వారికి ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించడమే ఆ ప్రోగ్రాం ఉద్దేశం.
ఆ విషయం తెలుసుకున్న శివంగి ఆనంద్ కుమార్‌ను కలిసింది. ఐఐటీలో చదివేందుకు ఆనంద్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంది. ఐఐటీ ప్రవేశ పరీక్ష రాసింది. ఫలితాలు చూసిన ఆమెకు ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు. ఆమె ఐఐటీ చదివేందుకు ఉత్తీర్ణత సాధించింది. ఎట్టకేలకు ఆమె అనుకున్నది సాధించింది. కష్టపడి చదివి ఐఐటీ చేసింది. ఆమె అన్వేషణ సరికొత్త గమ్యానికి చేర్చింది. ఇప్పుడు ఆమె ఐదంకెల జీతంతో అందమైన జీవితాన్ని గడుపుతూ కుటుంబానికి అండగా నిలిచింది. ఇప్పుడామె పేద కాదు పేదరికాన్ని జయించిన యువతి. ఇలాంటి మట్టిలో మాణిక్యాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించి, ప్రోత్సహించాలని మనస్పూర్తిగా ఆశిద్దాం.
