Header Ads

'సార్ నన్ను ఏమి చేయవద్దు' అని నిద్రలో కూడా కలవరిస్తున్న బాలిక.. అనుమానంతో పరీక్షించిన డాక్టర్లు

విద్యా బుద్దులు చెప్పాల్సిన వాడు దారి తప్పాడు. విద్యార్థులను సొంత బిడ్డలా చూసుకోవాల్సిన వాడు.. కీచకుడిలా మారాడు. ఓ బాలికను లైంగికంగా వేధించాడు. ఎక్కడో మారుమూల స్కూల్ లో జరిగిన దారుణం కాదు. హైదరాబాద్ నడి బొడ్డున ఓ స్కూల్ లో బయట పడ్డ వేధింపుల పర్వం ఇది. ఆ వివరాలలోకి వెళితే.. మేడ్చల్ జిల్లా కుషాయి గూడలోని డి.ఐ.ఈ కాలనీ లో ఉన్న.. అటామిక్ ఎనర్జీ స్కూల్ లో పీఈటీ గా పని చేసున్న అతని పేరు చంద్ర శేఖర్.

ఆడ పిల్ల కనిపిస్తే చాలు.. అతని లోని కీచకుడు బయటికి వస్తాడు. అసభ్యకరంగా మాట్లాడుతాడు. ఎక్కడెక్కడో తాకుతాడు. ఈ స్కూల్ లో ఇతని బారిన పడ్డ విద్యార్దునులు ఎంతో మంది. ఈ స్కూల్ లో చదువుతున్న అమ్మాయిపై 2 నెలలు గా లైంగిన వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇతగాడి వేధింపులతో.. పాపం ఆ అమ్మాయి జ్వరంతో ఆసుపత్రి పాలు అయింది. ఆసుపత్రిలో పరీక్షించిన డాక్టర్లు.. అనుమానంతో ప్రశ్నించడంతో స్కూల్ లో జరిగిన బాగోతం చెప్పింది. నిద్రలో కూడా.. 'సార్ నన్ను ఏమి చేయవద్దు' అని కలవరించేదని తల్లి తండ్రులు చెబుతున్నారు.

కీచక టీచర్ గురించి తెలుసుకున్న తల్లి తండ్రులు, స్థానికులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. చంద్ర శేఖర్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కీచక టీచర్ కి దేహశుద్ది చేసి.. పోలీసులకు అప్పగించారు. ఇలాంటి కీచకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.