ట్రంప్ కి ముంచుకొస్తున్న ప్రమాదం… డిసెంబర్ 19న ఇదే జరిగితే.. హిల్లరీనే ప్రెసిడెంట్
డోనాల్డ్ ట్రంప్ గెలిచి అందరిని ఆశ్చర్యానికి గురిచేచేసారు. ఎందుకంటే ప్రజలు మీడియా అంతా కూడా అతను ఎట్టిపరిస్థితుల్లో గెలవడని ప్రచారం చాలా గట్టిగా వచ్చింది. అందుకే అతని గెలుపు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కాని ‘ట్రంప్ మా అధ్యక్షుడు కాదు.. మాకు ప్రత్యేక దేశం ఇవ్వండి’ అంటూ కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి కొన్ని ప్రధాన నగరాల్లో అల్లర్లు జరుగుతున్నాయి. అధ్యక్ష పదవి చేపట్టకముందే ఈ అల్లర్లేమిటంటూ రిపబ్లికన్లు రుసరుసలాడుతున్నారు.
ఇదిలా ఉండగా ‘అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అనర్హుడని, ఆయన వైఖరి అధ్యక్ష పదవికి సరిపోదు. అమెరికాలోని అత్యధిక ప్రజల మద్దతును పొందిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను అధ్యక్షురాలిగా చేయాలి’… అంటూ ఎలక్ట్రోరల్ కాలేజీలో వేసిన ఆన్లైన్ పిటిషన్‌కు ఇప్పటికే 32 లక్షల 38 వేల 783 మంది మద్దతు తెలిపారు. Change.org ద్వారా పిటిషన్‌కు మద్దతు తెలిపే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డిసెంబర్ 19న ఎలక్ట్రోరల్ కాలేజీలో జరిగే ఎన్నికలో సభ్యులు హిల్లరీని ఎన్నుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అమెరికాకే కాక ప్రపంచానికే డోనాల్డ్ ట్రంప్ ప్రమాదకారి అని వారు చెబుతున్నారు. మరి డిసెంబర్ 19న జరిగే ఎలక్ట్రోరల్ కాలేజీ ఎన్నికల్లో వీరి ఆందోళనను పరిగణనలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాలి. ఈ విషయంలో ట్రంప్ మద్దతుదారులకు నిద్రలేకుండా చేస్తోంది.