ఇలా పిలిస్తే అమ్మాయిలకు యమా ఇష్టం.. ఇంకోమాటలో చెప్పాలంటే ఏదడిగినా ఇచ్చేస్తారు
అలాగని షార్ట్ గా “బెబ్ ” అని మాత్రం అనకండి. బేబ్ అనే పదాన్ని అసహ్యించుకుంటారట అమ్మాయిలు. బేబి అనే పదం మాత్రం గమ్మత్తుగా అనిపిస్తుందట. బాయ్ ఫ్రెండ్ నోటి నుంచి బేబి అనే పదాన్ని వినగానే ఏదో చిన్నపాపను గారం చేసి మాట్లాడినట్టు, బాయ్ ఫ్రెండ్ తండ్రిలాగా ప్రవర్తిస్తున్నట్లు, అదోరకం ఊహల విహారయాత్రకు వెళ్ళిపోతారు అమ్మాయిలు.
ఈ మధ్య సినిమాల్లో వాడేస్తున్నారుగా, ఇక మనమేం పిలుస్తాం అని అనుకోకండి, బేబి అనే పిలుపు కొత్తది కాదు కాని, విలువైనది. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఓ వారం రోజులు బేబి అని పిలవండి. తనలోని ముసిముసి నవ్వులు మీకు ఖచ్చింతంగా కనిపిస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ పిలిచే పేరుతో కాకుండా ఏదైనా స్పెషల్ గా ముద్దు పేరుతో పిలిస్తే ఇక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ అంటే పడి చచ్చిపోతుంది. ఇంకోమాటలో చెప్పాలంటే ఏదడిగినా ఇచ్చేస్తుంది.
