Header Ads

అత్తతో అల్లుడు అక్రమ సంబంధం అది చూసిన మామ ఏం చేశాడంటే ?

వాళ్ళకు కామంతో కళ్లుమూసుకుపోయాయి. వావివరుసలు మరిచి తల్లి సమానురాలైన అత్తతోనే శారీరక సంబంధం పెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. అది కాస్త ప్రత్యక్షంగా చూసిన మామకు ఆవేశం కట్టలు తెంచుకుంది. అల్లుడిని అతి దారుణంగా హత్య చేసి తన కసి తీర్చుకున్నాడు. చిత్తూరు జిల్లాలో ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.

చిత్తూరు జిల్లా మదనపల్లిలోని క్రిష్ణానగర్‌లో మామ ఖలీం బాషా ఇంట్లో కాపురముంటున్న అన్వర్‌ భాషా పిల్లనిచ్చిన అత్తగారిపైనే కన్నేశాడు. గత కొన్నేళ్ళుగా గుట్టుచప్పుడుగా అత్తగారితో సాగుతున్న అక్రమ సంబంధం కాస్త బయటపడింది. దీంతో మామ ఆవేశం కట్టలు తెంచుకోవడంతో కత్తితో పొడిచి అతి దారుణంగా అన్వర్‌బాషాను హత్య చేశాడు.

మానవ మృగంగా ప్రవర్తిస్తున్న అల్లుడి ప్రవర్తనపై విసుగు చెంది తానీ హత్య చేసినట్లుగా పోలీసులు ముందు అంగీకరించాడు నిందితుడు. సభ్యసమాజం తలదించుకునేలా ఈ సంఘటన మదనపల్లిలో సంచలనం రేపుతోంది.