Header Ads

షాకింగ్ కొన్ని వందల బస్తాల్లో రూ.500, రూ.1000 నోట్లకు నిప్పు


రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో భారీగా నల్లధనం ఉన్న ఒక వ్యాపారవేత్త వందల బస్తాల్లో ఉన్న నోట్ల కట్టలకు నిప్పుపెట్టించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాలిన నోట్ల తగలబడుతున్న ప్రదేశానికి వెళ్లి ఆర్బీఐ అధికారులకు సమాచారం అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరెల్లీ‌లో ఈ ఘటన జరిగింది. ఓ కంపెనీకి చెందిన వర్కర్లు కొన్ని వందల బస్తాల్లో రూ.500, రూ.1000 నోట్లను తెచ్చి తగులబెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.