భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం : నేటి అర్థరాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది షేర్ చేయండి
భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి అర్థరాత్రి నుంచి రూ.500, రూ.వెయ్యి నోట్లు ముద్రణ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఈ నిర్ణయం వెలువరించారు. మంగళవారం రాత్రి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ గొప్పస్థానం సంపాధించుకుందని మోదీ అన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు భారత ఆర్థిక వ్యవస్థను కొనియాడాయని చెప్పారు. భారత్ వేగంగా అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు.
పేదవారు స్వయం సమృద్ధి సాధించేలా చేయడమే తమ ప్రధాన లక్ష్యం అని, ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మోదీ చెప్పారు. అవినీతి నిర్మూలనకోసం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాలు పేదల అవసరాలు పట్టించుకోలేదని, దొంగనోట్లు అభివృద్ధికి అవరోదంగా మారాయని, పొరుగు దేశం దొంగనోట్లను రవాణా చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ నోట్లలో 90శాతం వెయ్యి, రూ.500 నోట్లే ఉంటున్నాయని మోదీ చెప్పారు. అభివృద్ధికి ఉగ్రవాదం పెద్ద అడ్డంకిగా మారిందని అన్నారు. ఆ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి 50 రోజుల సమయముందన్నారు. డిసెంబర్ 30 నాటికి నోట్లు మార్చుకోవచ్చని… అప్పటికి చేసుకోకపోతే మరో అవకాశం ఉందన్నారు ప్రధాని. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన కేంద్రాల్లో మార్చుకోవచ్చని తెలిపారు. నోట్లు మార్చే వరకు ఏటీయంలు పనిచేయవన్నారు. నకిలీ నోట్లు అభివృద్ధికి ఆటంకంగా మారాయి అన్నారు మోడీ.
Update :-వినీతిపై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అవినీతిని దేశం నుంచి సమూలంగా నిర్మూలించేందుకు ఇప్పటి వరకు దేశంలో చలామణిలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను నిషేధిస్తున్నట్ట ప్రకటించారు. అంతేకాక రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు ఏటీఎంలు పనిచేయవని పేర్కొన్నారు.
