3.5 కోట్లు పెద్ద నోట్లు మురికి కాల్వలో తేలుతూ...లేని వారికీ ఇచ్చిన బాగుండేది!!
పెద్ద నోట్ల రద్దుతో రాత్రికి రాత్రే బడా బాబులు వద్ద ఉన్న పెద్ద నోట్లు చిత్తు కాగితాల్లా మారాయి. కొందరు పెద్ద నోట్లతో చలి కాచుకొంటుంటే...మరికొందరి వద్ద ఉన్న పెద్ద నోట్లు కట్ల పాముల్లా నదుల్లో తేలుతున్నాయి... కాగా కొందరు గుళ్ళు గోపురాలకు విరళంగా రాత్రికి రాత్రే ఇచ్చేస్తున్నారు. కాగా అసోమ్ లో గుర్తు తెలియని వ్యక్తులు మురికి కాల్వలో పెద్ద నోట్లను పడేసి పోయారు.. వివరాల్లోకి వెళ్తే...
అసోం గౌహతి లో రుక్మిణీ నగర్ లోని మురికి కాల్వలో ఐదు, వెయ్యి నోట్ల కట్టలు తేలుతూ కనిపించడంతో అక్కడ గదరగోళం చోటు చేసుకొన్నది.. నోట్లు కాల్వలో తెలియాడుతుండడం ముందుగా స్థానిక బిచ్చగాళ్ళు చూశారు. అక్కడ వారి మద్య
గొడవ చోటు చేసుకోవడంతో ఆ నోటా ఈ నోటా పాకి పోలీసులవద్దకు చేరింది. దీంతో పోలీసులు అక్కడకు చేరి... ఆ నోట్లను స్వాధీనం చేసుకొనగా.. ఆ నోట్ల విలువ దాదాపు 3.5 కోట్లు ఉన్నట్లు ... ఈ ఘటనపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.
