Header Ads

ప్రపంచంలోని ఈ ప్రాంతాలలో బట్టలు వేసుకోవడం నిషిద్దం


సాధారణంగా ఎవరైనా చెప్పులు లేకుండా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తేనే వీడు ఏంటి చెప్పులు వేసుకోకుండా వెళ్తున్నాడు అని ఒక నిమిషం ఆగి మరి చూస్తుంటారు. అలాంటిది కొన్ని ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో బట్టలు వేసుకోవడం నిషిద్దం అని మీకు తెలుసా!. ఇలా బట్టలు వేసుకోవడం నిషిద్దం ఉన్న ప్రాంతాలు ఏంటో చూడండి.

హాట్ స్ప్రింగ్స్ బాతింగ్, జపాన్
టెక్నాలజీ కి మారు పేరైన జపాన్ దేశ రాజధాని టోక్యో లో ఉన్న ఆన్సేన్ అనే ప్రాంతంలో స్త్రీలు, పురుషులు కలిసి అక్కడున్న ప్రత్యేకమైన మినరల్స్ ఉన్న నీటిలో నగ్నంగా స్నానం చేస్తారు.

సిటీ కేప్ డి' ఆగ్డే, ఫ్రాన్స్
ఫ్రాన్స్ దేశం ఆధునిక జీవన శైలికి మారు పేరుగా పిలుస్తారు. ఫ్రాన్స్ లోని సిటీ కేప్ డి' ఆగ్డే ;ప్రాంతంలో బట్టలు వేసుకోవడం, వేసుకోకపోవడం అనేది ప్రజల ఇష్టం. అక్కడ ఎవరైనా ఎటువంటి అభ్యంతరం లేకుండా నగ్నంగా హాయిగా గడపవచ్చు.

ఆర్ట్ ఫెస్టివల్, ఆస్ట్రియా
ప్రపంచంలో జరిగే వింత పండుగలలో ఇది కూడా ఒకటి, ఈ పండుగలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్టిస్ట్ లు, మోడళ్ళు నగ్నంగా మారి తమ శరీరం పై రంగు రంగుల బొమ్మలు వేసుకుని ఆ పండుగలో ప్రత్యెక ఆకర్షణగా నిలుస్తారు.

స్పా ట్రీట్మెంట్స్ , ఇండోనేషియా
ఇండోనేషియా దేశంలో ఉన్న బాలీ ద్వీపం నూతన జీవనశైలి కి ప్రసిద్ది చెందింది. బాలీ లో ఉన్న మాసాజ్ లు, వివిధ థెరపీలతో నగ్నంగా రిఫ్రెష్ అవుతుంటారు.

సిటీ పార్క్, జర్మనీ
యూరోప్ ఖండంలో ఉన్న అతి పెద్ద సిటీ పార్కులలో జర్మనీలో ఉన్న సిటీ పార్క్ అఫ్ మునిచ్ కుడా ఒకటి. ఈ పార్కు కు వచ్చే సందర్శకులు బట్టలు లేకుండా నగ్నంగా మారి స్నానాలు చేస్తూ అక్కడ సేద తీరుతుంటారు.