ఆమెకి పెళ్లయింది.. అక్కా అని పిలుస్తున్నా. కానీ ఆమెను చూడకుండా, మాట్లాడకుండా క్షణం ఉండలేకపోతున్నా
[ ప్రశ్న - జవాబు శీర్షికకు స్వాగతం ]
ప్రశ్న :-
ఆఫీసులో నా వయసే ఉన్న ఓ అమ్మాయి పరిచయమైంది. తనని అక్కా అని పిలుస్తున్నా. కానీ నేను ఆ అమ్మాయిని చూడకుండా, మాట్లాడకుండా క్షణం ఉండలేకపోతున్నా. ఇది ఆకర్షణా? ప్రేమా? ఎలాంటి బంధమో నాకే అర్థం కావడం లేదు. తనకి పెళ్లైంది. ఆమెని మర్చిపోవడం ఎలా?
మానసిక వైద్యుల సలహా :-
మీ విషయానికొస్తే మీ కొలీగ్‌ని అక్కా అని పిలవడం ద్వారా ఆదర్శవంతంగా ఉండేందుకు తొలి ప్రయత్నం చేశారు. తర్వాత అదుపులేని ఆలోచనలు సవరించుకోవడానికి మానసిక నిపుణుల సలహా కోరడం అభినందనీయమే. ఇక మనసులోకి రకరకాల వూహలు రావడం సహజం. చెడ్డ ఆలోచనలు తక్షణం ఖండించి దానిస్థానంలో మంచిని ప్రవేశపెట్టేందుకు మనం ప్రయత్నించాలి. ఉదాహరణకు కుటుంబ సభ్యుడు బయటికెళ్లి సమయానికి తిరిగి రాకపోతే ముందు ప్రమాదం జరిగిందేమో అని భయపడతాం. వెంటనే కాదులే ఎవరైనా తెల్సినవాళ్లతో మాట్లాడుతున్నారేమో, ట్రాఫిక్ జాం అయ్యిందేమోనని సర్దిచెప్పుకుంటాం. అలాగే ఆమె గురించి చెడు ఆలోచనలు వస్తే వెంటనే వాటి స్థానంలో మంచివాటిని ప్రవేశపెట్టండి. ముందు ఆ అమ్మాయిని అక్కగా మీ కుటుంబానికి పరిచయం చేయండి. ఆమెతో రాఖీ కట్టించుకోండి. మిమ్మల్ని తమ్ముడిగా ఆమె భర్తకి పరిచయం చేయమనండి. ఇదంతా కొంచెం గందరగోళంగా ఉన్నా ప్రయత్నిస్తూ ఉంటే మనసు మీ మాట వింటుంది.