Header Ads

సూపర్.... హాస్పిటల్ లో 40,000 కట్టాలి.. పాత నోట్లు వద్దన్నారు... గంటలో ఫ్రెండ్స్ అందరూ కలిసి చిల్లర పోగేశారు... దెబ్బకి హాస్పిటల్ వాళ్ళకి మైండ్ బ్లాంక్


పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటించిన సంచలన నిర్ణయంతో సామాన్యులు అష్టకష్టాలు పడ్డారు. చిల్లర కోసం మోకాలి చిప్పలు అరిగేలా తిరిగారు. పాత నోట్లు ఎవరూ తీసుకోకపోవడంతో ప్రజలు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర సేవలందించే ఆసుపత్రులు కూడా పాత నోట్లను తీసుకునేందుకు తిరస్కరించాయి. దీంతో రోగులు నానా అవస్థలు పడ్డారు. అయితే సహనంతో ఆలోచిస్తే సరైన ఉపాయం తడుతుందనడానికి ఈ వ్యక్తే సరైన ఉదాహరణ.

కలకత్తాలోని పొద్దార్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో సుకంత్ చౌలే అనే డెంగ్యూ పేషెంట్ చికిత్స పొందుతున్నాడు. అతనిని గురువారం డిశ్చార్జ్ చేయాల్సి ఉంది. 40వేలు కడితే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. 40వేలు కట్టినా వైద్యులు ఆ డబ్బు తీసుకోవడానికి నిరాకరించారు. కారణం అవి పాత నోట్లు. తన దగ్గర పాత నోట్లు తప్ప 40వేలకు సరిపడా చిల్లర లేదు. దీంతో ఏం చేయాలో సుకంత్‌కు పాలుపోలేదు. కాస్త దీర్ఝంగా ఆలోచించిన అతనికి ఓ ఆలోచన తట్టింది.
వెంటనే స్మార్ట్‌ఫోన్ తీసి తన మిత్రులందరికీ సోషల్‌ మీడియా మరియు, వాట్సాప్‌‌కు ఓ మెసేజ్ పెట్టాడు. తన పరిస్థితి ఇలా ఉందని, చిల్లర ఉంటే దయచేసి ఇవ్వగలరని సందేశం పంపించాడు. అతని సందేశానికి అనూహ్య స్పందన వచ్చింది. కాయిన్లు వరదలా వెల్లువెత్తాయి. అతను సందేశం పంపిన గంటకే 40వేలు సమకూరాయి. 40 వేల చిల్లర నాణేలను ఓ బ్యాగ్‌లో పెట్టుకుని ఉదయాన్నే ఆసుపత్రికొచ్చారు.

ఆసుపత్రి యాజమాన్యం ఆ చిల్లర చూసి అవాక్కయ్యారు. అయితే ఈ చిల్లర తాము తీసుకోమని ఆసుపత్రి యాజమాన్యం పేచీ పెట్టింది. వాటికి బదులుగా బ్యాంక్ డ్రాఫ్ట్ ఇవ్వాలని కోరింది. అయితే ఆ చిల్లర వెనకున్న కథంతా చెప్పేసరికి యాజమాన్యం ఎట్టకేలకు అంగీకరించింది. ఆ చిల్లరనంతా కుప్ప పోసి ఆసుపత్రిలో లెక్కపెడుతుండగా ఓ చానల్ కెమెరామెన్ ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో జనం చిల్లర డబ్బును సంజీవనిగా భావిస్తుంటే, అయిన వారి కోసం అంత చిల్లర ఇవ్వడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి