Header Ads

రెండు వేల రూపాయల దొంగ నోట్లు చెలామనిలోకి వచ్చేశాయి! ఇవిగో ఇక్కడ ఉల్లిపాయలు కూడా కొన్నారు.


కర్ణాటకలోని చిక్కమగళూరులోని ఎపీఎంసీ మార్కెట్ లో శనివారం రూ. 2,000 నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. భారత ప్రధానమంత్రి మోడీ  బ్లాక్ మనీని అరికట్టడానికి రూ. 1,000, రూ.500 నోట్లు రద్దు చేసి కొత్తగా రూ. 2,000 నోట్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే అదునుగా కొందరు అప్పుడే రూ.2,000 నకిలి నోట్లు తయారు చేసి మార్కెట్ లోకి తీసుకువచ్చారు. చిక్కమగళూరులోని ఎపీఎంసీ మార్కెట్ లో ఉల్లిపాయలు (ఎర్రగడ్డలు) హోల్ సేల్ వ్యాపారం చేస్తున్నాడు అశోక్ అనే వ్యక్తి. శనివారం ఉదయం ఆయన టీ తాగడానికి బయటకు వెల్లగా…  అదే సమయంలో అశోక్ దగ్గర పని చేసే యువకులు దుకాణంలో ఉన్నారు.

తరువాత అక్కడికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రూ.2,000 నకిలి నోట్లు ఆ యువకులకు ఇచ్చి ఉల్లిపాయలు తీసుకు వెళ్లారు. తరవాత ఆ రూ.2,000 నోట్లకు చివరిలో కత్తెరతో కత్తిరించిన విషయం గుర్తించిన అశోక్ షాక్ అయ్యి…పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నకిలి నోట్లు తయారు చేసిన వారి కోసం గాలిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన రూ.2,000 నోట్లు చెల్లుబాటులోకి వచ్చిన రెండు రోజుల్లోనే నకిలి నోట్లు తయారు చెయ్యడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఒక మంచి ఆలోచన ఆచరణలో పెట్టడం చాలా కష్టం గాని, అదే అవినీతి అవలంభించడం చాలా ఈజీగా జరిగిపోతుంది…