లోకల్ జనం, పూజారులు, భక్తులు నిరసన కి దిగారు..షూటింగ్ ఆపాలని ఎందుకో తెలుసా?
డీజే – దువ్వాడ జగన్నాథం మూవీ షూటింగ్ వివాదంలో పడింది. కర్నాటకలో జరుగుతున్న చిత్రీకరణపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. హసన్ జిల్లా బేలూరులోని చెన్నకేశవ ఆలయంలో శివాలయం, శివలింగం సెట్లు వేసింది డీజే యూనిట్. ఇక్కడే స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. చెన్నకేశవ వైష్ణవ ఆలయంలో శైవాచారానికి సంబంధించిన సెట్లు వేయటం.. భక్తలను కనీసం ఆలయంలోకి కూడా అనుమతించకపోవటంపై లోకల్ జనం, పూజారులు, భక్తులు నిరసనకు దిగారు. షూటింగ్ నిలిపివేయాలని గొడవకు దిగారు. కర్నాటక దేవాదాయ శాఖ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని.. రోజుకు లక్షన్నర రూపాయలు అద్దె చెల్లిస్తున్నామని యూనిట్ సిబ్బంది చెబుతోంది. వైష్ణవ ఆలయంలో శైవాచారానికి సంబంధించిన సెట్స్ వేయటం ఏంటని.. దేవాదాయ శాఖ ఎలా అనుమతి ఇచ్చిందని స్థానిక పండితులు, పూజారులు, భక్తులు మండిపడుతున్నారు. దువ్వాడ జగన్నాథం చిత్రానికి దర్శకుడు హరీశ్ శంకర్. ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. స్కూటర్ పై వెళుతున్న బన్నీ.. బ్రాహ్మణుడి వేషంలో ఉన్నారు. బండిపై కూరగాయలు తీసుకుని వెళుతున్నాడు. ఒంటిపై విభూతి నామాలు, భుజంపై కాషాయ కండువ వేశాడు. మొత్తానికి పోస్టర్ మాత్రం ఊహించని విధంగా ఉండటమే కాదు.. మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.