వాట్సాప్ లో అమ్మాయిల ఫోటోలు పంపిస్తారు వాట్సాప్ లో నే వేలంపాట పాడుకుని ఎంజాయ్ చేయచ్చు
సెక్స్ రాకెట్ నిర్వాహకులు టెక్నాలజీ బాగానే వాడుకుంటున్నారు. అమ్మాయిల ఫోటోలను వాట్సప్‌లో పోస్ట్ చేసి.. వారికి ఎంత రేటు అనే విషయాన్ని కూడా చర్చించుకుంటారు. దీంతో గుర్‌గావ్‌లోని సెక్టార్ 51లో సాగుతున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఐదుగురు అమ్మాయిలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు విదేశీ యువతులు కాగా, మరో ముగ్గురు ఢిల్లీకి చెందిన వారని పోలీసులు వెల్లడించారు.
మొత్తం పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. విదేశీ యువతులకు కనీసం పాస్‌పోర్టులు కూడా లేవని పోలీసులు తెలిపారు. అసలు వాళ్లను ఎక్కడినుంచి రప్పించారో, ఎలా పిలిపించారో అన్నది కూడా ఇంకా బయటపడలేదు. ఈ రాకెట్ సూత్రధారులు ఎవరన్న విషయం దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.