Header Ads

పెళ్ల‌య్యాక భార్య‌ను ఇలా ల‌వ్ చేయాలి


వివాహ బంధం మానవ జీవితంలో మ‌ర‌పురాని మ‌ధురానిభూతినిచ్చే బంధం. ఇద్ద‌రి మ‌నుషుల‌ను ఒక‌గూటికి చేర్చే మ‌హ‌త్త‌ర బంధం. కానీ గ‌తంతో పోలిస్తే ఈనాటి దంప‌తులు అన్యోన్యంగా ఉండ‌డం చాలా త‌క్కువ‌నే చెప్పాలి. ఏవేవో కార‌ణాల‌తో, చాలా చిన్న చిన్న కార‌ణాల‌తో వివాహ బంధాల‌ను తెంచేసుకుంటున్నారు.
కొన్ని సందర్భాల్లో భార్యల వల్ల ఈ సమస్య తలెత్తుతుంటే.. మరికొన్ని సందర్భాల్లో భర్తల వల్ల ఈ స‌మస్య వ‌స్తోంది. ఏదైతేనేమి మగాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించి, కాస్త సహనం వహించి భార్యను ప్రేమగా చూసుకుంటే ఎప్పటికీ సమస్య తలెత్తదు. ఆ సంసారం కలకాలం పచ్చగా నూరేళ్ల పంటమ‌యం అవుతుంది. భార్యపై ప్రేమను వ్యక్తం చేయడానికి కొన్ని సూచ‌న‌లు ఇలా..
* ఉదయాన్నే భార్యకు ప్రేమతో కప్పు కాఫీ కలిపివ్వడం, బయటి నుంచి వచ్చే సరికి స్నాక్స్‌లాంటివి చేయడం.. ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తుంటే భర్తపై భార్యకున్న ప్రేమ డబుల్‌ అవుతుంది.
* వంటలో కాస్త సాయం చేస్తే భార్య భర్తల మధ్య బంధం మరింత బ‌ల‌ప‌డుతుంది.
* వంట చేయ‌డంలో సాయం అంటే కష్టపడి వంట నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వంటలో ఏ మాత్రం కాస్తంత ప్రవేశమున్నా భార్యకు వంట గ‌దిలో ఎంతో సహాయం చేయవచ్చు. కూరగాయలు తరగడం నుంచి బియ్యం కడగడం వరకూ ఏ పని చేసి పెట్టినా, ఆ కాస్త సమయం మరింత ముద్దు, ముచ్చట్లకు ఆదా చేసుకున్నట్టే కదా.
* కిచన్ లో భార్య వంట చేస్తున్నప్పుడు అవసరానికి ఏదో ఒకటి అందించినా, ఇద్దరి మధ్యా అనురాగం పెరుగుతుంది.
* పాలు స్టౌ మీద పెట్టి వాటిని వేడి చేసి కాఫీపొడి, పంచదార కలిపితే వేడివేడి కాఫీ తయారవుతుంది. కాఫీ లేదంటే టీ… తయారు చేయడం సులభమే. ఎటొచ్చీ ఎంత పంచదార, పొడి వేయాలన్నదానిపై అవగాహన పెంచుకుంటే చాలు ప‌ని సులువ‌వుతుంది.
* సతీమణి ఎన్నడూ చేయని ఓ వంటకం గురించి కాస్తంత రీసెర్చ్ చేసి, అది ఎలా తయారు చేయాలో నేర్చుకోండి. దీంతో జీవిత భాగస్వామిని ఎంతో ఇంప్రెస్ చేయవచ్చు.
* ఏదైనా ఓ స్పెషల్ వంటను చేసిన తరువాత, దానికి మరింత అందాన్నిచ్చేలా అలంకరణ… అంటే గార్నిష్ చేయడంలోనూ కాస్తంత ప్రత్యేకత చూపాలి. ఇక ఏ రాత్రయితే డిన్నర్ సమయంలో మీదైన ఓ స్పెషల్ వంట ఉంటే, ఆ రాత్రి మరింత మధురానుభూతులను మిగుల్చుకోవచ్చు సుఖ‌మ‌యం చేసుకోవ‌చ్చు. నూరేళ్ల పంట‌ను సాకారం చేసుకోవ‌చ్చు.