Header Ads

ఆరెంజ్ జ్యూస్ లో ఇది కలిపి తాగితే 15 రోజుల్లో బరువు తగ్గుతారు.. ఎముకలు ఉక్కులా ధృడంగా తయారవుతాయి


ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్యాన్నిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. రెగ్యులర్ గా ఈ జ్యూస్ తీసుకొంటే బోలెడు ప్రయోజనాలున్నాయి. అయితే ఈ జ్యూస్ లో అదనంగా కొన్ని కలిపి తీసుకుంటే మరిన్ని అద్బుత ప్రయోజనాలు కనిపించనున్నాయి. ఎముకలు బలంగా ఉండేందుకు, కొలెస్ట్రాల్ కరిగి బరువు తగ్గేందుకు ఈ ఆరెంజ్ జ్యూస్ ను ఎలా తాగాలో చూద్దాం..
ఇలా తాగాలి
ఓ గ్లాస్ నీటిలో ఓక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, కొద్దిగా ఉప్పు వేసి కషాయం తయారు చేయాలి. ఆ తర్వాత దానిని వడకట్టాలి.
వడకట్టిన కషాయంకు సమానమైన ఆరెంజ్ జ్యూస్ అప్పటికే తీసిన కమలాపండు రసాన్ని కలిపి ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగాలి. 15 రోజులు రెగ్యులర్ గా చేస్తే అద్బుతమైన ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి. కషాయంలో మాత్రమే జ్యూస్ కలపాలి. జ్యూస్ కలిపి కషాయాన్ని వేడిచేస్తే మిశ్రమం చేదుగా మారుతుంది ఈ విషయాన్ని గమనించాలి.
ఇలా తాగటం వల్ల ఎముకలు ఉక్కులా ధృడంగా తయారవుతాయి. కొలెస్ట్రాల్ కరిగి బరువు వేగంగా తగ్గుతారు.
ప్రయోజనాలు
కమలా ఫలంలో సిట్రస్ లిమినోయిడ్స్ ఉంటాయి. కమలా పండులో మాంసకృత్తులు, పిండి పదార్థాలు, పీచుతోపాటు ఖనిజ లవణాలైన క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము, సోడియం, పొటాషియం పుష్కళంగా లభిస్తాయి. ఇందులోని ఏ, సీ విటమిన్లతో పాటు థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్ తదితరాలు మెండుగా ఉంటాయి.
ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాటం చేస్తాయి. అలాగే చర్మం, ఊపిరితిత్తులు, గర్భాశయంనకు సంబందించిన సమస్యలు రాకుండా కాపాడతాయి.
కమలాపండు తొనలతో చర్మం మీద మృదువుగా రుద్దుకొని కాసేపాగి గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే బ్యాక్టీరియా మొత్తం నశిస్తుంది.
ప్రతి రోజు కమలా రసం తీసుకోవటం వలన మూత్రపిండాల పనితీరు మేరుగుపరుతుంది. ఈ పండులో విటమిన ఎ ఉండుట వలన కంటి చూపు స్పష్టంగా ఉండటానికి దోహదం చేస్తుంది.
కాలేయం పనితీరును క్రమబద్దీకరణ చేస్తుంది. కమలా పండులో ఉండే పీచు శరీరంలో ఉండే హానికరమైన కొలస్ట్రాల్ ను కరిగిస్తుంది.
పొటాషియం ఎక్కువగా ఉండుట వలన గుండెకు రక్తాన్ని సక్రమంగా సరఫరా చేయటానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి శరీరంలోని వ్యర్ధాలను బయటకు పోవటానికి దోహదం చేస్తుంది.
ఇందులో ఉండే మెగ్నీషియమ్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
కాల్షియం దంతాలు, ఎముకలను పటిష్టంగా ఉంచడానికి దోహదం చేస్తుంది.
కమలా పండులోని ఫైబర్ శరీరంలోని కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది.