కోట్లుపెట్టి పట్టుపరుపులు కొనుకున్నా,నిశ్శబ్దాన్ని ,చల్లగాలిని ఏర్పరచుకున్నా..కంటినిండా నిద్రలేనపుడు అవెవున్నా దండగే.నిద్రలేమికి తొంభైశాతం మానసిక సమస్యలే కారణం.పదిశాతం మాత్రమే శారిరక కారణాలు అని చెప్పవచ్చు.మానసికంగా శక్తివంతంగా ఉండాలంటే ముందుగా మన మెదడు దానికి ప్రిపేర్డ్ గా ఉండాలి.ముఖ్యంగా మహిళలు ఇంటి పనులు అటు ఆఫీస్ పనులతో సతమతమవుతుంటారు.అటువంటప్పుడు సరైన నిద్రలేనట్టయితే ఆ ప్రభావం వారి డెయిలీ యాక్టివిటీస్ పై కూడా పడ్తుంది.సాధారణంగా మనిషికి వారి వయసును బట్టి 8 నుండి పది గంటలు నిద్ర అవసరం అవుతుంది.కొంతమంది అంతకంటే ఎక్కువ సమయమే పడుకున్నప్పటికీ ఎంత గాఢనిద్రపోతున్నారన్నది ప్రశ్నే.నిద్రలేమి సమస్య లేకుండా ఉండాలంటే ముందుగా మన మైండ్ ని సన్నద్దం చేయాలి.దానికోసం మీరు సింపుల్ టెక్నిక్ పాటిస్తే చాలు అరవై సెకన్లలో గాఢనిద్రలోకి జారుకుంటారు.
ఆ టెక్నిక్ ఏంటంటే…
• శ్వాస మీద ధ్యాస ఉంచడం.. మనం ముక్కు ద్వారా పీల్చిన గాలిన అలాగే 7,8 సెకన్ల పాటు పట్టి ఉంచి నోటి ద్వారా 8సెకన్ల పాటు వదలడం…మొదట్లో ఇలా చేయడం కష్టంగా ఉన్నప్పటికీ మెల్లి మెల్లిగా అలవాటయి 60 సెకన్లలో మీరు నిద్రలోకి జారుకుంటారు.ఇలా చేయడం వలన త్వరగా నిద్రపట్టడమే కాదు.రక్తప్రసరణ జరిగి గుండె పనితీరు మెరుగుపడడమే కాదు.మైండ్ రిలాక్స్ అవుతుంది.మెదట్లో ఈ టెక్నిక్ పని చేయనట్లే అనిపించినా నెమ్మదిగా దీని ఫలితం మీకు అర్దం అవుతుంది.సో ఆల్ ది బెస్ట్ హ్యాపీ టు స్లీప్…