Header Ads

13 ఏళ్ల విద్యార్థితో కడుపు తెచ్చుకున్న 24 ఏళ్ల టీచర్.. విచిత్రం ఏంటంటే..


టెక్సాస్‌కు చెందిన అలెగ్జాండ్రియా వెరా(24) అల్‌డైన్ స్కూల్‌ డిస్ట్రిక్ట్‌లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తోంది. గతేడాది వేసవిలో 13 ఏళ్ల విద్యార్థితో ఆమెకు ఏర్పడిన పరిచయం సెప్టెంబరు నాటికి శారీరక సంబంధం వరకు వెళ్లింది. ఈ ఏడాది జనవరిలో ఆమె గర్భం దాల్చింది. విచిత్రం ఏంటంటే.. విద్యార్థి, టీచర్ బంధాన్ని బాలుడి తల్లిదండ్రులు సమర్థించడం. పలుమార్లు టీచర్‌ను ఇంటికి తీసుకెళ్లిన విద్యార్థి.. ఆమెను తన గర్ల్‌ఫ్రెండ్‌గా కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు. విషయం తెలిసిన స్కూలు యాజమాన్యం ఏప్రిల్‌లో ఆమెను ఉద్యోగంలోంచి తొలగించింది. విషయం పోలీసులకు చేరింది. వారు చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీస్‌కు సమాచారం అందించారు. వారొచ్చి ఆమెను ఇంటరాగేట్ చేసిన తర్వాత ఫిబ్రవరిలో అలెగ్జాండ్రియా అబార్షన్ చేయించుకుంది. పోలీసులు ఆమెను వెతుకుతుండడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అనంతరం మోంట్‌గోమెరీ కౌంటీ పోలీసుల ఎదుట బుధవారం లొంగిపోయింది. లక్ష డాలర్ల బాండ్ సమర్పించిన అనంతరం ఆమెను విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. చిన్నారిపై లైంగిక దాడి కేసును ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటోంది .

అలెగ్జాండ్రియా వాదన మాత్రం మరోలా ఉంది. తాను విద్యార్థితో ప్రేమలో పడ్డానని, ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు కూడా తెలుసని పేర్కొంది. వారు తమను సమర్థించారని పేర్కొంది. అయితే వారు మాత్రం ఆమె వాదనను కొట్టిపడేస్తున్నారు. టీచర్ ఇలా చేస్తుందని ఎవరైనా ఊహిస్తారా అని వారు ప్రశ్నించారు. పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్నామంటే వారు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారని భావిస్తాం. కానీ ఇలా జరుగుతుందని ఊహిస్తామా, ఈ ఘటనపై లోతైన విచారణ జరిపించాలని ఆని ఆయన కోరారు. మరోవైపు టీచర్, విద్యార్థి ‘రిలేషన్‌షిప్’ గురించి తమకు తెలుసని సహ విద్యార్థులు పేర్కొన్నారు.