షాకింగ్ : డిసెంబర్ తర్వాత ఈ ఫోన్లలో వాట్సాప్ రాదు
మీరు సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్‌ను వాడుతున్నారా..? అయితే మీరు డిసెంబరు 31 తర్వాత మీ మొబైల్ ఫోన్లలో వాట్సప్ ఆప్‌ను వాడలేరు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ను నోకియా హైఎండ్ మొబైళ్లలోను, ఎన్ సిరీస్‌తో ప్రారంభమయ్యే అన్ని ఫోన్లలోనూ, తరువాత వచ్చిన ఎన్8 సిరీస్ ఫోన్లలోను ఉపయోగిస్తున్నారు.
వాట్సప్ సంస్థ సంవత్సరం ప్రారంభంలోనే వినియోగదారులందరికి ఈ విషయాన్ని వెల్లడించింది. సంవత్సరం ముగుస్తుండటంతో వినియోగదారులకు మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేస్తోంది. సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్ వినియోగదారులందరు కూడా దానిని మార్చుకోవాలని, అంతే కాకుండా ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2 వెర్షన్‌లతో నడుస్తున్న బ్లాక్‌బెర్రీ ఫోన్లలో కూడా వాట్సప్‌ను ఉపయోగించలేరని సంస్థ తెలిపింది.
* బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ 10
* నోకియా ఎస్40
* నోకియా ఎస్60
* ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2,
* విండోస్ ఫోన్ 7.1
* యాపిల్ ఐఫోన్ 3 జిఎస్, ఐఫోన్ ఐఓఎస్ 6లు ఉపయోగించే అన్ని ఫోన్లకు వాట్సప్ సేవలు వర్తించవని సంస్థ వెల్లడించింది.
అయితే నోకియా సంస్థ చాలా కాలం నుండి ఫోన్లను తయారు చేయడం ఆపివేసింది. గతంలో తయారుచేసిన నోకియా ఈ6, నోకియా 5233, నోకియా సి5 03, నోకియా ఆషా 306, నోకియా ఈ52 ఫోన్లలో సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది.