Header Ads

నిన్నఆకాశం నుండి తమిళనాడులో పడ్డ ఈవింత ఆకారం గురించి తెలుసా?


ఒక్కోసారి మన కళ్ళని మనమే నమ్మలేని వింతలు, విడ్డూరాలు బలేగా కనబడతాయి, ఇక రూమర్స్ కి అయితే కొదవే లేదు, అదిగో ఆకాశంలో అల్లా ఆకారం కనపడింది, ఇల్లా ఆకారం వింతగా ఉంది? అంటూ తెగ ప్రచారం చేస్తారు…  సోషల్ మీడియా సంగతైతే చెప్పనవసరం లేదు… రోజు మనం ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరు వీటి గురించి పోస్ట్ చేస్తారు… కొన్ని మనవాళ్ల ఫోటోషాప్ లో వండర్స్  క్రియేట్ అయ్యి… సోషల్ మీడియాలో చెక్కర్లు కొడతాయి, కొన్ని  నిజంగానే జరుగుతాయి.

అలాంటి వింతే ఒకటి నిన్న తమిళనాడు రాష్ర్టం లోని  కరూర్‌ జిల్లా గౌండపాళయంలో ఒక నల్లటి వింత ఆకారం ఆకాశం నుండి భారి శబ్దంతో సడన్ గా క్రింద పడింది. ఆశబ్దానికి బయపడిన స్థానిక ప్రజలు పరుగులు దీశారు. అది ఎగిరే సాసర్ అంటూ పుకార్లు షికార్లు చెయ్యడంతో స్థానికులు మరెంత దూరం పారిపోయారు. ఈవింత ఆకారం దాదాపు 10 కిలోల బరువుతో, గుండ్రటి ఇనుప రేకు కనిపించింది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసు, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖల సిబ్బందితో పాటు బాంబు స్క్వాడ్ నిపుణులు అక్కడికి చేరుకుని ఈవింత ఆకారం యెక్క రహస్యం చేదించే పనిలో పడ్డారు.