ప్రేమిస్తున్నాను అని చెప్పిన వారం తర్వాత నుండి సెక్స్ కావాలి అంటున్నాడు. అతని ప్రేమ నిజమేనా ? తెలుసుకోవడం ఎలా ?
[ ప్రశ్న - జవాబు శీర్షికకు స్వాగతం ]
ప్రశ్న :- నా వయస్సు 21 సంవత్సరాలు. ఇంజనీరింగ్ పూర్తి చేసి కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యాను. ఆఫీస్‌లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. మేం ఇద్దరు ఎక్కువగా కలిసి పని చేయడం వల్ల ఇద్దరి మద్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఒకానొక సమయంలో అతడు నన్ను ముద్దు పెట్టి ఐలవ్ యూ చెప్పాడు. ఐలవ్ యూ చెప్పిన వారం రోజుల తర్వాత నన్ను అతడి రూంకు తీసుకు వెళ్లాడు. అక్కడ నాతో సెక్స్‌కు బలవంతం చేశాడు. అయితే నేను మెన్సస్ ప్రాబ్లం అని చెప్పి అక్కడ నుండి బయట పడ్డాను. అప్పటి నుండి ప్రతి రోజు నాకు సెక్స్ కావాలి అంటూనే ఉన్నాడు. నాకు కూడా కోరికగానే ఉంది కానీ అతడు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడా, లేక సెక్స్ కోసం ప్రేమిస్తున్నట్లుగా నటిస్తున్నాడా అనేది అనుమానంగా ఉంది. అతడి ప్రేమలోని నిజాయితిని పరీక్షించడం ఎలా?
మానసిక వైద్యుల సలహా :-
ఒక్క మాటలో చెప్పాలి అంటే నిజమైన ప్రేమ పెళ్లికి ముందు శృంగారం కోరదు. అంతగా అతగాడికి శృంగార కోర్కెలు ఉంటే త్వరగా పెళ్లి చేసుకుని మీతో శృంగారంలో పాల్గొనేవాడు. మీతో అతడు పెళ్లి ప్రస్థావన తెస్తున్నాడా అనే విషయాన్ని నువ్వు వెళ్లడి చేయలేదు. నీతో సెక్స్ కోరిన వెంటనే నువ్వు పెళ్లి చేసుకుందాం అనండి. అప్పుడు అతడు ముందు సెక్స్ తర్వాత పెళ్లి అన్నాడే అనుకోండి అతడిది నిజమైన ప్రేమ కాదు అని 90 శాతం నిర్థారణకు వచ్చేయవచ్చు. మీకు ఐలవ్ యూ చెప్పడమే ముద్దు పెట్టి చెప్పాడు అని అంటున్నారు కనుక, అతడు ఏదో కోరి ప్రేమిస్తున్నాడు అనిపిస్తోంది. ఇక మీ పెద్దవాళ్ళతో మాట్లాడమని చెప్పండి, అలాగే అతడి కుటుంబ సభ్యులకు మిమ్మల్ని పరిచయం చేయమనండి, అలా చేయని పక్షంలో అతడిది ఫేక్ లవ్ అని 99 శాతం నిర్థారణకు వచ్చేయవచ్చు. ముందు అతగాడికి ఈ పరీక్షలు పెట్టి నిజమైన ప్రేమేనా అనే విషయాన్ని నిర్థారించుకోండి. కొంత మంది నిజంగా ప్రేమించినా కూడా శృంగారాన్ని కోరుకుంటారు. వెయ్యిలో ఒక్కరు ఇద్దరు మాత్రమే అలా ఉంటారు. మీకు కూడా కోరికగా ఉందని చెప్పారు కానీ పెళ్ళికి ముందు ఆ తప్పు చేయద్దు.
