ఇద్దరమ్మాయిలు ఇంటి నుండి పారిపోయారు. సహజీవనం చేసి పెళ్లి చేసుకున్నారు
ఇద్దరమ్మాయిలు ఇంటి నుండి పారిపోయారు. సహజీవనం చేసి పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ విచిత్ర ఘఠన ఆగ్రాలో చోటు చేసుకుంది. వార్తకు సంబంధించి.. ఆగ్రాలోని ఓ పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ సైన్సు ఫైనలియర్ చదువుతున్న విద్యార్థిని స్థానికంగా బ్యూటీపార్లర్ నడుపుతున్న 25 ఏళ్ల మహిళను ప్రేమించింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులను అడిగింది. దీనికి వారు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆగ్రాకు సమీపంలోని ద్వేరి అనే గ్రామంలో యువతిని గుర్తించారు. అప్పటికే సహజీవనం చేసి పెళ్లి కూడా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే యువతి మాత్రం తన తల్లిదండ్రులతో వెళ్లేది లేదని, తన పెళ్లి అయిపోయిందని తెలిపింది. మేజర్ కావడంతో పోలీసులు ఏమీ చేయలేమని చెప్పారు.
