Header Ads

ఈ దేశాలకు వెళ్లాలంటే మన ఇండియన్స్ కు వీసా అక్కర్లేదు


భారతీయులు ఈ ప్రపంచంలో చాలా దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు.

బొలీవియా – ఈ దేశానికి వెళ్ళగానే వీసా ఇస్తారు. 90 రోజుల గడువుంది

ఇండోనేషియా – ఈ దేశానికి వెళ్ళగానే 30 రోజులకు వీసా ఇస్తారు

ఆండోరా – ఈ దేశానికి భారతీయులు వీసా లేకుండా వెళ్ళి ఎన్ని రోజులైనా ఉండవచ్చు

మారిషస్ – ఈ దేశానికైతే అసలు వీసానే లేకుండా 90 రోజులుండవచ్చు

కేప్ వెర్డే – ఈ దేశానికి వెళ్ళగానే వీసా ఇస్తారు. గడువు లేదు.

జోర్డాన్ – అక్కడకు వెళ్ళగానే రెండు వారాలకు వీసా ఇస్తారు. కానీ చేతులో 3000 అమెరికన్ డాలర్లు ఉండాలనే నిబంధన ఉంది.

కెన్యా – ఈ దేశానికైతే వెళ్ళిన వెంటనే ఇస్తారు. దాంతో మూడు నెలలు అక్కడ ఉండవచ్చు.

ఫిజీ – ఈ దేశానికి అసలు వీసా లేకుండా నాలుగు నెలలు ఉండవచ్చు.

సోమాలియా – అక్కడికి వెళ్ళగానే ఇస్తారు. కానీ అక్కడికి వెళ్ళడానికి రెండు రోజుల ముందుగానే మిమ్మల్ని ఆహ్వానించిన వారు అక్కడి విమానాశ్రయంలో దరఖాస్తుని సమర్పించాలి.

పలావ్ – ఈ దేశానికి వెళ్ళగానే 30 రోజులకు వీసా ఇస్తారు.

సీషెల్స్ – ఈ దేశానికి వెళ్ళగానే 30 రోజులకు అనుమతి పత్రం ఇస్తారు.

హైతీ – ఈ దేశంలో అసలు వీసా లేకుండా 3నెలలు ఉండవచ్చు.

గునియా బిస్సావ్ – ఈ దేశానికి వెళ్ళగానే 90 రోజులకు వీసా ఇస్తారు.

డామినికా – ఈ దేశానికి వెళ్ళగానే 6నెలలకు వీసా ఇస్తారు.

నౌరూ – ఈ దేశానికి వెళ్లగానే ఇస్తారు. గడువు లేదు.

జమైకా – ఈ దేశానికి వీసా అక్కర్లేదు. గడువు కూడా లేదు.

ఈ సల్వడార్ – ఈ దేశంలో అసలు వీసా లేకుండా 90రోజులు ఉండవచ్చు.

సెయింట్ లూసియా – ఈ దేశానికి వెళ్ళగానే ఇస్తారు. 6 వారాలు గడువు.

మడగాస్కర్ – ఈ దేశానికి వెళ్ళగానే 90రోజులకు అనుమతిస్తూ వీసా ఇస్తారు.

సమో – ఈ దేశంలో వీసా లేకుండానే 30రోజులు ఉండవచ్చు.

లావోస్ – ఈ దేశానికి వెళ్ళగానే 30రోజులకు వీసా ఇస్తారు.

మాల్దీవులు – ఈ దేశానికి వెళ్ళగానే ఇస్తారు. 90రోజుల గడువు.

మైక్రోనేషియా – అక్కడకు వెళ్ళగానే ఇస్తారు. 30రోజుల గడువు.

శ్రీలంక – ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అనే పద్ధతి అనుమతిస్తారు. గడువు 30 రోజులు.

నేపాల్ – ఈ దేశానికి వెళ్ళాలంటే పాస్ పోర్టు కూడా అక్కరలేదు. ఒక గుర్తింపు పత్రం ఏదైనా ఉంటే చాలు. అంతే కాక ఆ దేశానికి వచ్చేభారతీయులు స్వేచ్ఛగా తిరగడమే కాక అక్కడ జీవించవచ్చు కూడా.

టాంజానియా – వీసా అక్కడకు వెళ్ళగానే ఇస్తారు. గడువు లేదు.

కంబోడియా – అక్కడకు వెళ్ళగానే 30రోజులకు వీసా ఇస్తారు.

భూటాన్ – అక్కడకు వెళ్ళాలంటే వీసా అక్కరలేదు. గడువు కూడా లేదు.