మేఘాల్లోకి తీసుకువెళ్ళే రైలు ఇదొక్కటే....ఎక్కడో తెలుసా
మేఘాల్లో తేలిపోతున్నట్లు కలలు కనటం సాధారణం. కానీ నిజంగా అలా మేఘాల్లో తేలిపోతే... అప్పుడే మేఘాల్లో తేలిపోతున్నారా? అసలు అదేమిటా అని ఆరా తీస్తున్నారా? అయితే అర్జెంటీనా వెళ్ళాల్సిందే!
అర్జెంటీనా దేశం సల్జా నగరం నుంచి లా పోల్వోరిల్లా అనే ప్రదేశానికి వెళ్లే రైలు మిమ్మల్ని మేఘాల్లోకి తీసుకెళుతుంది. సముద్ర మట్టానికి 4 వేల మీటర్ల ఎత్తుకు తీసుకువెళ్ళే ఈ రైలును ‘‘ట్రైన్ టు ది క్లౌడ్స్’’ అని పిలుస్తారు. ప్రపంచంలోనే ఎత్తయిన రైలు మార్గం ఇదేనట! చూడముచ్చటైన వంతెనలు, గుహల్లోంచి ఈ రైలు దాదాపు 217 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. 4200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో మేఘాలు, స్వచ్ఛమైన గాలి, కాలుష్యం లేని చల్లటి వాతావరణం ఉంటుంది. పర్యాటకులు అక్కడ దిగి కాసేపు మేఘాల ఉనికిని, గాలిని, చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించి, ఫోటోలు తీసుకుని అదే రైలులో బయలుదేరిన చోటుకు తిరిగి వెడతారు. రవాణా కోసం నిర్మించిన రైలు మార్గం ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారి సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభవాలను అందిస్తోంది.