Header Ads

ఫేస్బుక్లో లైక్ కొడితే.అమ్మాయిలు పడిపోతారా? సింగ్ల్ లైన్ సైకలాజికల్ యాంగిల్


ఫేస్‌బుక్‌లో లైక్ కొడితే... అమ్మాయిలు పడిపోతారా? ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేస్తే... ఆన్‌లైన్‌లో వేధిస్తే దారికొస్తారా? సైబర్ క్రైమ్ చూపిస్తున్న సైకలాజికల్ యాంగిల్ ...కేటుగాళ్లకిది కొత్త రకం వార్నింగ్ ఇస్తున్నారు అమ్మాయిలు. రీసెంట్‌ కేసుల వెనుక సింగ్‌ల్‌ లైన్‌ సైకాలజీ చాలానే ఉంటుంది.

అవతల వ్యక్తి తెలిసినా తెలియక పోయినా...ఫ్రెండ్‌ లిస్ట్‌లో చేర్చేస్తున్నారు...అవసరం ఉన్నా లేకున్నా...వారితో మాటలు కలిపేస్తున్నారు...సున్నితమైన అంశాలను...ఇంకా చెప్పాలంటే...తమ సీక్రెట్స్‌ను రివీల్‌ చేసేస్తున్నారు...ఫోన్‌ నెంబర్లను మార్చుకుంటున్నారు...మిడ్‌ నైట్‌ వరకు చాటింగ్‌లతో టైం స్పెండ్‌ చేస్తున్నారు...అది ఇప్పుడు ఓ వ్యసనంలా మారిపోతోంది...అదే అమ్మాయిలకు చిక్కులు తీసుకువస్తోంది. ఎవరితో షేర్‌ చేసుకోలేమని అనుకుంటున్న ఇష్యూస్‌ను టచ్‌ చేస్తే చాలు.. ఇట్టే కరిగిపోతారు... అలాంటి వారి గురించి పూర్తిగా తెలియక పోయినా... కాస్త ఇంప్రెస్‌ చేస్తే... చాలు కనెక్ట్‌ అయిపోతారు... ఒకేసారి ఓపెన్ అయిపోతారు.. అంతే..

అక్కడే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్.. కనెక్ట్‌ అయ్యారు కదా అని కంటిన్యూ అయిపోతే... కన్‌ఫ్యూజన్‌లో పడేస్తారు..కొంతమంది అవకాశవాదులు వీటినే అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు.. ఇక అప్పటి నుంచి షరా మామూలే.. మెంటల్‌ టార్చర్‌... ఫ్రస్టేషన్‌... ఏం  చేయాలో అర్ధం కాక డిఫెన్స్‌లో పడిపోతారు. తెలియని వ్యక్తులతో స్నేహం కాస్తా ముదిరి...మోసగాల మాయలో పడిపోతున్నారు అమ్మాయిలు. ఇలా వారికి బానిసలవుతున్నారు. వారి బెదిరింపులకు భయపడి కొందరు డబ్బులు సమర్పించుకుంటే.. ఇంకొందరు యువతులు మాత్రం ఏం చేయాలో తెలియక తమలో తామే మధనపడుతున్నారు. పేరెంట్స్ కు చెప్పుకోలేరు..

ఈ బాధ ఎవరితో పంచుకోవాలో తెలియదు.. నరకాన్ని ప్రత్యక్ష్యంగా చూస్తున్నారు. . తెలియక చేసిన ఒక్క చిన్న తప్పుతో ఇంతగా బాధపడాల్సి వస్తోంది.