Header Ads

షాకింగ్ న్యూస్! రెండువేల రూపాయల నోట్లు వెనక్కి? నోట్స్ పై ప్రింటింగ్ తప్పుగా జరగటమే కారణం?

500, 1000 నోటు రద్దయ్యి 2000 రూపాయల నోటు వచ్చింది. అయితే ఈ నోటు పై ఇప్పటికే చాల కామెంట్ లు వచ్చాయి. మొత్తం డబ్బులు బ్యాంక్ లో వేయించుకుని, 2000 ఇస్తుంటే ఆనోటు కి చిల్లర దొరకక నానా కష్టాలు పడతున్నారు జనం. సరే ఇదిలా ఉంటె.. ఆ నోట్ లో మిస్టేక్ ఉన్న ప్రాంతాన్ని రౌండప్ చేసి ట్విట్టర్ , వాట్సాప్ , ఫేస్ బుక్ పెడతున్నారు. వాటికి కొందరూ సమాధానం కూడా ఇస్తున్నారు. ఇంతకీ ఆ ప్రశ్నలు సమాధానాలు ఎలా ఉన్నాయో చూద్దాం…

ప్రశ్న..
 ఏ నోట్ పై అయినా 15 భాషల్లో ఆ నోటు విలువను తెలిపేలా రాస్తారు. సేమ్ 2000/- నోట్ పై కూడా అలాగే రాశారు. కానీ  ఈ నోట్ పై ఓ సారి ” దోన్ హజార్ రుపియా” అని, ఓ సారి “దోన్ హాజార్ రుపయె” అని రాసి  ఉంది. వాస్తవానికి రెండు వేల రూపాయాలను హిందీలో  “దో హజార్ రుపియే” అనాలి. అలా కాకుండా..దోన్ హాజార్ రుపియే అని తప్పుగా రాశారని,అది కూడా రెండు సార్లు రాశారని చాలా మంది ఆరోపిస్తున్నారు.

జవాబు…
దీనికి కొందరు.. దోన్ హాజార్ రుపియా అనేది ఒకటి కొంకణీ లాంగ్వేజ్ ది, మరో దోన్ హాజార్ రుపియే అనేది మరాఠి లాంగ్వేజ్ ది, హిందీ జాతీయ భాష కాబట్టి దానిని సెపరేట్ గా దో హజార్ రుపియే అని  రాశారు. అని సమాధానమిచ్చారు.

ప్రశ్న..
భారత రాజ్యాంగం గుర్తించిన 24 భాషాల్లో కూడా ఆ నోట్ విలువను తెలిపేలా రాయొచ్చుగా?

జవాబు..
రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషలకు లిపి లేదుగా అనేది ఆన్సర్.
ఈపరిస్థితిలో… సామాజిక మాధ్యమాలైనా ఫేస్బుక్, వాట్సప్ వివిధ మాధ్యమాలలో… రెండు వేల రూపాయల నోట్లని ప్రబుత్వం వెనక్కి తీసుకోనున్నదని విశ్రుతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా ఈ నోటుపై చర్చలు చేస్తూ…డబ్బులు లేక ఖర్చులు ఆపుతూ వస్తున్నారు ప్రజలు…